Begin typing your search above and press return to search.

RRR రిలీజ్‌: పెద్ద పండ‌గపైనే మోజేల జ‌క్క‌న్నా?

By:  Tupaki Desk   |   9 Feb 2020 2:30 PM GMT
RRR రిలీజ్‌: పెద్ద పండ‌గపైనే మోజేల జ‌క్క‌న్నా?
X
RRR స‌డెన్ ట్విస్ట్ అభిమానుల‌కు ఇంకా డైజెస్ట్ కావ‌డం లేదు. జూలై 31న పాన్ ఇండియా ట్రీట్ ఖాయ‌మైంద‌ని ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ప్ర‌పంచ‌వ్యాప్త అభిమానుల‌పై ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లుతూ రాజ‌మౌళి- దాన‌య్య బృందం తీసుకున్న నిర్ణ‌యం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 2021 సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్ వాయిదా అని ప్ర‌క‌టించ‌గానే అభిమానుల‌కు ఇది నిజంగానే బిగ్ షాక్ అయ్యింది. అయితే ఇంద‌రిని నొప్పించే ఆ క‌ఠిన‌ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెన‌క కార‌ణం ఏమై ఉంటుంది? బాహుబ‌లి త‌ర‌హాలోనే వాయిదా వేయ‌డానికి కార‌ణ‌మేమిటో! అని ఆరాతీస్తే అస‌లు సంగ‌తి తెలిసిందే.

జూలైని కాద‌ని ఆర్నెళ్ల పాటు వాయిదా వేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్- గ్రాఫిక్స్ - ఎఫెక్ట్స్ ప‌నుల‌కు చాలా స‌మ‌యం ప‌డుతుంద‌న్న అంచ‌నా ఒక‌టి కాగా.. సంక్రాంతి అయితే త‌మ‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల్ని జ‌క్క‌న్న బృందం విశ్లేషించింద‌ట‌. పెద్ద పండ‌గ సెంటిమెంటుగా వ‌ర్క‌వుట‌వుతుంది. అప్పుడు రిలీజ్ చేస్తే టాక్ తో సంబంధం లేకుండా కాసుల కుంభ‌వృష్ఠి కురుస్తుంద‌న్న‌ది ప్రాథ‌మిక అంచ‌నా. ఆర్.ఆర్.ఆర్ క్రేజీ కాంబినేష‌న్ కావడంతో ఆ క్రేజుతో ప్రీమియ‌ర్లు-ఓపెనింగులు అత్యంత భారీగా తెచ్చేందుకు .. అలాగే టిక్కెట్టు రేట్లు పెంచి రిలీజ్ చేసుకునేందుకు ఆస్కారం క‌లుగుతుంది.

దాదాపు 10 రోజుల వ‌ర‌కూ సెల‌వులు క‌లిసొస్తాయి.. తెలుగు రాష్ట్రాల్లో పండ‌గ మూడ్ పెద్ద ప్ల‌స్ అవుతుంది. ప్ర‌తియేటా సంక్రాంతి బ‌రిలో రిలీజ‌వుతున్న సినిమాల‌న్నీ మంచి రిజ‌ల్ట్ అందుకుంటున్నాయి. ఫ్లాపైంది అన్న సినిమాకి కూడా ఓపెనింగుల ప‌రంగా డోఖా ఉండ‌డం లేదు. ఇక 2018లో ఖైదీనంబ‌ర్ 150- గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి లాంటి రెండు భారీ చిత్రాలు సంక్రాంతికి రిలీజై అద్భుత వ‌సూళ్లు సాధిస్తే.. ఆ త‌ర్వాత చిన్న సినిమాగా రిలీజైన శ‌త‌మానం భ‌వ‌తి అంతే పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. 2019 సంక్రాంతికి రిలీజైన ఎఫ్ 2 బంప‌ర్ హిట్ కొట్ట‌గా ఇత‌ర సినిమాలు భారీ ఓపెనింగులు గుంజుకున్నాయి.

2020 సంక్రాంతికి రిలీజైన అన్ని పెద్ద సినిమాలు భారీ వ‌సూళ్ల‌ను సాధించ‌డం లో స‌క్సెస‌య్యాయి. అల వైకుంఠ‌పుర‌ములో క్లీన్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిస్తే .. యావ‌రేజ్ కంటెంట్ ఉన్న సినిమా అన్న విమ‌ర్శ‌లు ఎదురైనా.. స‌రిలేరు నీకెవ్వ‌రు అంతే భారీ క‌లెక్ష‌న్స్ సాధించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అందుకే ఆర్.ఆర్.ఆర్ బృందం ఎంతో తెలివిగా 2021 సంక్రాంతికి వాయిదా వేసింద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. ఆర్.ఆర్.ఆర్ కి రామ్ చ‌ర‌ణ్‌- రామారావు - రాజ‌మౌళి అనే ముగ్గురు దిగ్గ‌జాలు క‌లిసారు కాబ‌ట్టి ఆ మేర‌కు పండ‌గ హీటెక్కిపోవ‌డం ఖాయం అన్న అంచ‌నా కూడా దీనికి కార‌ణం. అలాగే అటు బాలీవుడ్ మార్కెట్ స‌హా.. ఇత‌ర చోట్లా సంక్రాంతికి సెంటిమెంటుగా వ‌ర్క‌వుట‌వుతుంద‌ని అంచనా వేశార‌ట‌. మొత్తానికి మార్కెట్ ప‌రమైన గ‌ణాంకాలు.. లెక్క‌లు ఆర్.ఆర్.ఆర్ వాయిదాకి కార‌ణం అని తెలుస్తోంది.