Begin typing your search above and press return to search.
10 రోజుల కోసం తారక్ చరణ్ లు
By: Tupaki Desk | 31 Oct 2018 8:44 AM GMTటాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి నెక్స్ట్ మూవీ అంటేనే హైప్ ఆకాశాన్ని తాకుతుంది. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబో దానికి తోడైతే ఇక ప్రత్యేకంగా చెప్పాలా. అందుకే షూటింగ్ మొదలుకాకుండానే దీని గురించిన చర్చ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనే దాని గురించి ఖచ్చితమైన తేదీ అధికారికంగా చెప్పనప్పటికీ లోలోపల రాజమౌళి దీనికి సంబందించిన ఏర్పాట్లు పూర్తి చేసేశాడని సమాచారం.
దాని ప్రకారం తొలుత పది రోజుల పాటు ఏకధాటిగా సాగే షెడ్యూల్ లో తారక్ చరణ్ లు ఇద్దరూ పాల్గొనే సన్నివేశాలు షూట్ చేయబోతున్నారు. అది పూర్తయ్యాక చరణ్ బోయపాటి బాలన్స్ వర్క్ ఫినిష్ చేయడం కోసం అటు వెళ్ళిపోతాడు. ఎలాగూ రెండింటి నిర్మాత డివివి దానయ్య కాబట్టి అడ్జస్ట్ మెంట్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ మేరకు ప్లానింగ్ జరిగిపోయినట్టు సమాచారం. ఆ తర్వాత ఎన్టీఆర్ మీద సోలోగా షూట్ చేయాల్సిన సీన్స్ పూర్తి చేసి చరణ్ తిరిగి జాయిన్ అయ్యాక ఇద్దరి కాంబినేషన్ సీన్లు కంటిన్యూ చేయబోతున్నట్టు తెలిసింది. దీనికి మరో కారణం కూడా చెప్పొచ్చు. షూటింగ్ స్టార్ట్ అయ్యింది ఇద్దరు కలిసి నటిస్తున్నారు అనే ఫీలర్లు ఇంకాస్త బలంగా ఆధారాలతో వదిలితే క్రేజ్ పాటు బిజినెస్ హైప్ కూడా ఇంకా ఎక్కువగా ఎగబాకుతుంది.
తక్కువ ఖర్చుతో మతి పోయే మార్కెటింగ్ చేయడంలో దిట్ట అయిన రాజమౌళి మల్టీ స్టారర్ విషయంలో కూడా చాలా పక్కా స్కెచ్ తో ఉన్నట్టు సమాచారం. హీరోయిన్ల వేట ఇంకా కొలిక్కి రాలేదు. విలన్ గా జగపతి బాబు పేరు గట్టి పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇవన్నీ మహా అయితే ఓ రెండు మూడు వారాల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. జక్కన్న సెట్ లోకి అడుగుపెట్టాక ఇక రచ్చ మాములుగా ఉండదని ఎదురు చూస్తున్నారు ఇద్దరి హీరోల అభిమానులు.