Begin typing your search above and press return to search.
రాజమౌళి చెప్పేశాడు.. పక్కా అని
By: Tupaki Desk | 30 Oct 2021 11:30 AM GMT‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇప్పటికే మూడుసార్లు రిలీజ్ డేట్ మార్చుకుంది. ఇంకోసారి డేట్ మారిస్తే ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఇంకోసారి వాయిదా ఉండదనే అనుకుంటున్నారు. కానీ అదే సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ టీం మీద విపరీతమైన ఒత్తిడి కూడా వస్తోంది. ఇప్పటికే సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలకు డేట్లు ఖరారు చేసి వాటిని ఆ తేదీల్లో విడుదలకు సిద్ధం చేస్తుంటే.. ఇలా హఠాత్తుగా జనవరి 7కు ‘ఆర్ఆర్ఆర్’ను షెడ్యూల్ చేయడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’లో కథానాయికగా నటించిన ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన ‘గంగూబాయి కతియావాడీ’ని జనవరి 6కు ఖరారు చేసిన నేపథ్యంలో బాలీవుడ్ నుంచి కూడా రాజమౌళి కి ప్రెజర్ తప్పట్లేదు. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ ను మళ్లీ వాయిదా వేస్తారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
కానీ రాజమౌళి మాత్రం తమ చిత్ర బృందానికి అలాంటి ఉద్దేశాలేమీ లేవని సంకేతాలు ఇచ్చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ పక్కాగా జనవరి 7నే వస్తుందని.. వేరే చిత్రాలకు, దీనికి పోటీ అసలు సమస్యే కాదని జక్కన్న స్పష్టం చేశాడు. ‘‘ఆర్ఆర్ఆర్, గంగూబాయి కతియావాడీ సినిమాల మధ్య బాక్సాఫీస్ క్లాష్ విషయంలో నాకెలాంటి బాధ లేదు. ఏ సినిమా ప్రేక్షకులు ఆ సినిమాకు ఉంటారు. సినిమాల మధ్య క్లాష్ అనేది వ్యాపారాన్ని ఏమీ దెబ్బ తీయదు. ఒకేసారి నాలుగు చిత్రాలు విడుదలైనా బాగుంటే నాలుగింటినీ ప్రేక్షకులు ఆదరిస్తారు. జనవరిలో చాలా సినిమాలొస్తున్నాయి. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అన్ని సినిమాలు బాగా ఆడేలా ఒకరికొకరు సహకరించుకోవాలి. విడుదలయ్యే అన్ని సినిమాలూ బాగా ఆడి మంచి వసూళ్లు రాబట్టి, ప్రేక్షకులకు చక్కటి వినోదం పంచాలని కోరుకుంటున్నా’’ అని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాజమౌళి పేర్కొన్నాడు. దీన్ని బట్టి ఎవ్వరేమన్నా.. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా 2022 జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ రావడం పక్కా అని తేలిపోయింది