Begin typing your search above and press return to search.
రాజమౌళి.. ప్రభాస్ రాజూ అని సంబోధిస్తే..
By: Tupaki Desk | 1 Jun 2017 1:11 PM GMTతెలుగులో స్టార్ హీరోల్ని వాళ్ల నటన.. అందం.. లాంటివి చూసి అభిమానించే ఫ్యాన్స్ మాత్రమే ఉండరు. కులం పిచ్చితో అభిమానించే వాళ్లూ ఉంటారు. అభిమానులు కులాల వారీగా కూడా విడిపోయారు తెలుగు రాష్ట్రాల్లో. సినీ హీరోల్ని అభిమానించే విషయంలో దేశంలో ఇంకెక్కడా లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో ‘కులం’ అనేది కీలక పాత్ర పోషిస్తోందంటే అతిశయోక్తి ఏమీ లేదు. కొందరు హీరోలకు సైతం ఈ కులం పిచ్చి ఉన్న సంగతీ ఒప్పుకోవాల్సిందే. ఐతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఇందుకు మినహాయింపు అని దర్శక ధీరుడు రాజమౌళి కితాబిచ్చాడు. ప్రభాస్ కు కుల పిచ్చి అసలేమాత్రం లేదని తేల్చి చెప్పాడు రాజమౌళి.
ప్రభాస్ మైనస్ పాయింట్ల సంగతి చెబుతూ.. వ్యక్తిగతంగా అతడికి విపరీతమైన బద్దకం అని చెప్పిన రాజమౌళి.. తనకు కుల పిచ్చి మాత్రం లేదని చెప్పాడు. ‘బాహుబలి’ షూటింగ్ సందర్భంగా తాము అతణ్ని ఆటపట్టించడానికి ‘ప్రభాస్ రాజు గారూ’ అని సంబోధించే వాళ్లమని.. ఐతే ఆ మాట అన్న ప్రతిసారీ అతను చాలా ఇబ్బంది పడేవాడని రాజమౌళి తెలిపాడు. ఆ మాట అన్నపుడల్లా.. అలా అనొద్దు డార్లింగ్ అంటూ ప్రభాస్ బతిమాలాడే వాడని రాజమౌళి వెల్లడించాడు. ఇక హీరోల్ని కులం ఆధారంగా అభిమానించడంపై రాజమౌళి స్పందిస్తూ.. ఇది మరీ ఎక్కువ స్థాయిలో ఏమీ ఉండదని చెప్పాడు. అభిమానం-కులం అనే విషయాలు కలిసిపోయాయని.. 90 శాతం మామూలు ఫ్యాన్స్ ఉంటే.. 10 శాతం కుల ఫ్యాన్స్ ఉంటారని రాజమౌళి చెప్పాడు. ఈ పది శాతం కుల అభిమానుల వల్ల మిగతా వాళ్లు ఇబ్బంది పడుతున్నారన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/