Begin typing your search above and press return to search.
'ఆర్.ఆర్.ఆర్' లో అతని పాత్ర అలా ఉండబోతోందా...?
By: Tupaki Desk | 24 Jun 2020 4:32 PM GMTదర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ చిత్రంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ నటీనటులతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో రాజమౌళి రూపొందించిన 'ఈగ' సినిమా హిందీలో 'మక్కీ' పేరుతో డబ్ చేయగా.. ఆ చిత్రానికి అజయ్ దేవగణ్ వాయిస్ ఓవర్ అందించారు. అప్పటి నుంచి అజయ్ దేవగన్ రాజమౌళి సినిమాలో నటించాలని అనుకుంటున్నారు. ఫైనల్ గా 'ఆర్.ఆర్.ఆర్' లో ఎంతో కీలకమైన పాత్ర కోసం అజయ్ దేవగణ్ ని తీసుకున్నారు.
కాగా అజయ్ దేవగన్ మీద ఇప్పటికే హైదరాబాద్ లో భారీ సెట్ వేసి 10 రోజుల చిత్రీకరణ కూడా పూర్తి చేసారు 'ఆర్.ఆర్.ఆర్' చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్ లో 1900 నాటి ఇండియాని ప్రతిబింభించేలా సీన్స్ షూట్ చేసారట. అంతేకాకుండా ఈ చిత్రంలో ‘ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’లో అజయ్ దేవగన్ పర్ఫార్మెన్స్ ని మరోసారి గుర్తు చేస్తుందని.. దీనికి కొనసాగింపుగా ఆర్.ఆర్.ఆర్ లో అతని రోల్ ఉండబోతోందని సమాచారం. ప్లాష్ బ్యాక్ లో రానున్న ఈ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇక అజయ్ దేవగన్ కి జోడీగా హీరోయిన్ శ్రీయా సరన్ కనిపించనున్నారు. అజయ్ దేవగన్ బాలీవుడ్ మార్కెట్ పరంగా కూడా 'ఆర్.ఆర్.ఆర్' కి ప్లస్ అవుతాడని మేకర్స్ భావిస్తున్నారట.
'ఆర్.ఆర్.ఆర్' లో చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు'గా కనిపిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్నారు. ఇక అలియా భట్ సీత పాత్రలో కనిపించనుంది. 'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళి నుండి వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక జక్కన్న ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 70 శాతానికి పైగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా పరిస్థితులు అనుకూలిస్తే మిగతా షూటింగ్ కంప్లీట్ చేయాలని రెడీ అవుతున్నారు.