Begin typing your search above and press return to search.
#RRR:దానయ్య చెప్పినా ఆగని పుకార్లు..బాహుబలి డేట్ కు ఫిక్స్
By: Tupaki Desk | 12 April 2020 2:30 PM GMTరాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్.. రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంను ఈ ఏడాది జులై 30న విడుదల చేయాల్సి ఉండగా షూటింగ్ కు అంతరాయం ఇతరత్ర కారణాల వల్ల వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 8న విడుదల చేస్తామంటూ యూనిట్ సభ్యులు ప్రకటించిన విషయం తెల్సిందే. షూటింగ్ కు లాక్ డౌన్ కారణంగా అంతరాయం ఏర్పడటంతో మళ్లీ సినిమా వాయిదా పడబోతుంది అంటూ గత కొన్నా రోజలుగా మీడియాలో తెగ వార్తలు వచ్చాయి.
సినిమా మళ్లీ వాయిదా పడబోతున్నట్లుగా వస్తున్న వార్తలను నిర్మాత దానయ్య కొట్టి పారేశాడు. సినిమా షూటింగ్ రెండు నెలలు ఆగినా కూడా అనుకున్న సమయంకు సినిమాను విడుదల చేస్తామన్నట్లుగా దానయ్య పేర్కొన్నాడు. దానయ్య వాయిదా విషయమై క్లారిటీ ఇచ్చినా కూడా మళ్లీ అవే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. విడుదల విషయంలో జక్కన్న దానయ్యల మద్య వివాదం ఏమైనా ఉందా అన్నట్లుగా పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.
దానయ్య ఎట్టి పరిస్థితుల్లో సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తూ ఉంటే దర్శకుడు జక్కన్న మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రిల్ 28కి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడట. బాహుబలి చిత్రం అదే తేదీలో వచ్చిన విషయం తెల్సిందే. అందుకే జక్కన్న ఆ తేదీని ఎంపిక చేసుకున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
జక్కన్న సినిమా ఆలస్యం అయినా కూడా ప్రేక్షకులు నిరుత్సాహ పడకుండా ఆ కొత్త తేదీ కోసం వెయిట్ చేస్తారు. జక్కన్న ఎంత ఆలస్యంగా వస్తే ఔట్ పుట్ అంత అద్బుతంగా వస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. కాని దానయ్య మాత్రం సంక్రాంతికే వస్తుందని చెబుతున్నాడు. ఇందులో ఏది నిజమో కాలమే నిర్ణయిస్తుంది.