Begin typing your search above and press return to search.
రాజమౌళి కొడుకు డెస్టినేషన్ వెడ్డింగ్
By: Tupaki Desk | 26 Sep 2018 12:12 PM GMTదర్శకదిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి పుత్రరత్నం కార్తికేయ .. నటుడు జగపతిబాబు అన్న కూతురు పూజాను వివాహమాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి సంబంధించి యువతరంలో గత కొంతకాలంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. కార్తికేయ అనుభవజ్ఞుడైన టెక్నీషియన్. మంచి ఎడిటర్. రాజమౌళి టీమ్‌లో ఎంతో కాలంగా పని చేస్తున్నారు. అలానే క్రీడా సంబంధ వ్యాపారాల్లోనూ కార్తికేయ పెట్టుబడులు పెట్టడం చర్చకొచ్చింది. ఇకపోతే వధువు పూజా మంచి గాయని అని తెలిసింది. అయితే ఈ జంట వెడ్డింగ్ పనులు ఎంతవరకూ వచ్చాయి? అంటే .. ఊరూ వాడా పందిరేసి.. పీపీపీ డూడూడూ అంటూ చేసుకునే పెళ్లి కాదు ఇది. ఏకంగా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
అంతేకాదు డెస్టినేషన్ వెడ్డింగ్ సంగతిని కార్తికేయ స్వయంగా కన్ఫామ్ చేశారు. ఈ వెడ్డింగ్ కోసం ఏకంగా ఐదారు రోజుల పాటు విదేశాల్లో స్పెండ్ చేయనున్నారని, అలానే కేవలం ఫ్యామిలీ ఎఫైర్ లా పరిమిత గెస్టులతోనే జరగనుందని తెలుస్తోంది. ఇటీవల సెలబ్రిటీ వెడ్డింగ్స్ అన్నీ ఈ తరహాలోనే జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే కార్తికేయ భవిష్యత్ లో దర్శకత్వం వహిస్తారా? డాడ్ రాజమౌళిని అనుసరిస్తారా? అన్నదానిపైనా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు . మీ స్నేహితుడు అఖిల్ ని డైరెక్ట్ చేస్తారా? అని ప్రశ్నిస్తే అలాంటిదేం లేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దర్శకత్వం అన్న ఆలోచన లేదని అనేశాడు. ఇకపోతే నవతరం ఎలా ఉండాలో చెబుతూ.. ఇంట్లోవాళ్లు చెప్పింది వినడం కరెక్టయిన పద్ధతి అని విన్నవించాడు. ఇక కొత్త పెళ్లికొడుకులో ఇదివరకటితో పోలిస్తే కాస్తంత సిగ్గుకు సంబంధించిన ఎక్స్ ప్రెషన్ కనిపిస్తోంది.