Begin typing your search above and press return to search.
రాజమౌళి కుమారుడు కథలు వండుతున్నాడు
By: Tupaki Desk | 9 May 2016 11:30 AM GMT రమా రాజమౌళి కుమారుడు కార్తికేయ మెగా ఫోన్ పట్టే యోచనలో ఉన్నాడు.గతంలో నిహారికాతో ఓ షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేసిన కార్తికేయ.. దానిని బయటకు తేలేకపోయాడు. కాని రాజమౌళి చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేస్తూ వర్క్ పరంగా తానెంత సిన్సియర్ హార్డ్ వర్కరో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు.దానిలో భాగంగానే తాను పెట్టిన ప్రొడక్షన్ హౌస్ ద్వారా బాహుబలి ఫస్ట్ టీజర్ - అఖిల్ థియేట్రికల్ ట్రైలర్ విషయంలో తన వర్క్ ఏంటో సినీ లవర్స్ కు చూపించే ప్రయత్నం కూడా చేశాడు. కొన్ని సినిమాలకు సంబంధించిన టీజర్ - థియేట్రికల్ ట్రైలర్స్ కటింగ్ వర్క్ లతో పాటు ప్రమోషన్లను కూడా టేకప్ చేస్తూ ఉన్నాడు.
తాజాగా కార్తికేయ ఓ సినిమా స్టోరీపై సీరియస్ గా కూర్చుని వర్క్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.బాహుబలి 2 వర్క్ పూర్తయ్యాక సరికొత్త జోనర్ కధతో మన ముందుకు రావాలని తన టాలెంట్ ఏంటో చూపించుకోవాలని తహ తహ లాడుతున్నాడట.అందులో భాగంగా వినూత్నమైన రీతిలో కథలను తయారుచేసే పనిలో పడ్డాడు.
నిజానికి పిఆర్ వర్క్స్ పై మంచి కమాండ్ ఉన్న కార్తికేయ... మాంచి ఈవెంట్ మేనేజర్ గా మారతాడని పరిశ్రమలో చాలామంది భావించారు.రాజమౌళి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు.కాని అలా అయితే ఆ విధంగా వచ్చే గుర్తింపు తనకు అంతగా ఉండదని కాబోలు..తనలో ఉన్న క్రియేటివిటీని బయటకు తేవాలని ఇలా మెగా ఫోన్ పడుతున్నాడని చెబుతున్నారు.కార్తికేయ మ్యాటర్లో ఎవరు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్త పరిచినప్పటికీ.... ఒకటి మాత్రం వాస్తవం... 'విషయం ఉంటే మాత్రం కార్తికేయ ఖతర్నాక్ డైరెక్టర్ 'గా మారొచ్చు.