Begin typing your search above and press return to search.
జక్కన్న ఇంట శుభకార్యంకు ముహూర్తం ఫిక్స్
By: Tupaki Desk | 16 Nov 2018 5:37 AM GMTరమా - రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహ నిశ్చితార్థం గత సెప్టెంబర్ లో జరిగిన విషయం తెల్సిందే. చాలా కాలంగా ప్రేమిస్తున్న పూజాను కార్తికేయ పెళ్లి చేసుకోబోతున్నాడు. కార్తికేయ మరియు పూజాలు వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహంకు సిద్దం అయ్యారు. జగపతిబాబు అన్న రాం ప్రసాద్ కూమార్తె అయిన పూజా సింగర్ గా మంచి గుర్తింపు దక్కించుకొనగా - కార్తికేయ ఆల్ ఇన్ వన్ అంటూ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ దూసుకు వెళ్తున్నాడు.
కార్తికేయ - పూజల వివాహ నిశ్చితార్థం చాలా సింపుల్ గా అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు - సెలబ్రెటీలు - స్నేహితుల సమక్షంలో జరిగింది. అయితే వివాహం మాత్రం టాలీవుడ్ మొత్తం హాజరు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా కార్తికేయ - పూజల వివాహంకు డేట్ ఫిక్స్ చేశారు. జనవరి 5 - 2019న వీరి వివాహాన్ని రామానాయుడు స్టూడియోలో నిర్వహించబోతున్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు నిమగ్నమై ఉన్నారు.
ఒక వైపు ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను చూసుకుంటూనే మరో వైపు తనయుడి వివాహానికి సంబంధించిన ఏర్పాట్లలో జక్కన్న నిమగ్నమయ్యాడు. ఆహ్వాన పత్రికలను పంచడంతో పాటు - షాపింగ్ మరియు ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా జక్కన్న పాలు పంచుకుంటున్నారట. ఈ వివాహానికి టాలీవుడ్ కు చెందిన అతిరథ మహారథులను ఆహ్వానించడంతో పాటు - తెలుగు రాష్ట్రాల ముఖ్య రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించబోతున్నారు. కార్తికేయ - పూల వివాహం అంగరంగ వైభవంగా జరగడం ఖాయం.