Begin typing your search above and press return to search.
రాజమౌళి మాటః రజినీతో సినిమా చేస్తా
By: Tupaki Desk | 10 April 2017 4:17 AM GMTరజినీకాంత్.. సౌత్ ఇండియాలో తిరుగులేని సూపర్ స్టార్. రాజమౌళి.. ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్లలో ఒకడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది..? ఈ కాంబినేషన్ ను ఊహించుకుంటేనే ప్రకంపనలు రేగడం ఖాయం. ఐతే ఎప్పుడు ఏంటన్నది చెప్పలేదు కానీ.. ఏదో ఒక రోజు తాను రజినీకాంత్ తో సినిమా చేస్తానని అంటున్నాడు రాజమౌళి. ‘బాహుబలిః ది కంక్లూజన్’ తమిళ ఆడియో వేడుకలో మాట్లాడుతూ రాజమౌళి ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూడా ఏదో ఒక రోజు సినిమా తీస్తా. మహాభారతం తీయాలని ఎప్పటినుంచో ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు చెబుతా. ప్రస్తుతం నా మదిలో ‘బాహుబలి’ తప్ప వేరే ఆలోచన ఏదీ లేదు’’ అని రాజమౌళి అన్నాడు.
ఇక ‘బాహుబలిః ది కంక్లూజన్’ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘బాహుబలి కథ అంతా ఒకటే. కానీ నిడివి ఎక్కువగా ఉండటంతోనే రెండు భాగాలుగా తీశాం. రెండో భాగంలో పాత్రల మధ్య సంఘర్షణను కనపడుతుంది. అలాగే మొదటి భాగం చూసిన ప్రేక్షకులకు తలెత్తిన అన్ని సందేహాలకు ‘బాహుబలి-2’లో సమాధానం దొరుకుతుంది. బాహుబలి చిత్రంలోని ప్రతీ పాత్ర ప్రజల్లోకి చొచ్చుకుని పోయింది. బాహుబలిని తమిళంలో ప్రత్యేకంగా తీయాలనుకున్నప్పుడు తమిళ ఫ్లేవర్ పోకుండా నాజర్.. సత్యరాజ్ లాంటి వాళ్లతో ప్రతి విషయాన్ని చర్చించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. తమిళ ప్రేక్షకులకు మాతృభాషలోని మాధుర్యం అందేలా ప్రతి దృశ్యం.. పాత్ర బాగా వచ్చేలా ఈ చిత్రానికి పని చేసిన తమిళ సాంకేతిక బృందం ఎంతో కష్టపడింది’’ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/