Begin typing your search above and press return to search.

రాజమౌళి గర్వపడ్డ ఆ మూడు సంఘటనలు

By:  Tupaki Desk   |   24 Jan 2017 12:49 AM GMT
రాజమౌళి గర్వపడ్డ ఆ మూడు సంఘటనలు
X
--ప్రస్తుతం బాహుబలి 2 సినిమా రిలీజ్ విషయంలో ఫుల్ బిజీగా ఉన్న దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.. ఇప్పుడు ''శ్రీవల్లి'' సినిమా ఆడియో లాంచ్ కు వచ్చాడు. ఈ సినిమాను డైరక్ట్ చేసింది ఎవరో కాదు.. ఆయన తండ్రి.. బాహుబలి రైటర్ విజయేంద్రప్రసాదే. ఈ సందర్భంగా తన తండ్రిని చూసి ఏయే సందర్భాల్లో తాను చాలా గర్వపడ్డాడో చెబుతూ.. ఓ మూడు సంఘటనలు వివరించాడు రాజమౌళి.

--ఎన్నో ఏళ్ళపాటు కేవలం ఘోస్ట్ రైటర్లగా పనిచేసిన పెదనాన్న శివ శక్తి దత్తా.. నాన్న విశ్వవిజయేంద్ర ప్రసాద్ లు.. తొలిసారిగా 'జానకిరాముడు' సినిమాతో వెండితెరపై క్రెడిట్ అందుకున్నారట. ఆ సినిమా గురించి సితార మ్యాగజైన్లలో వచ్చిన తొలి న్యూస్ చూసుకుని.. అందులో వీరి పేర్లను చూసుకుని.. కుటుంబం అంతా ఎంతో ఆనందపడి.. దేవుడి గదలో ఆ మ్యాగజైన్ పెట్టి పూజ చేశారట. అది తాను గర్వించిన తొలి సంఘటన అన్నాడు రాజమౌళి.

--ఇక తన తండ్రి దగ్గర అసిస్టెంట్ గా చేరినప్పుడు.. ఎప్పుడూ ఇంగ్లీష్‌ నవల్స్ చదివే మీరు ఎందుకిలా తెలుగుబారిన కథలు రాస్తున్నారు అంటే.. ఆయన వెంటనే ఒక కథ చెప్పారట. ''రష్యా వారు యునైటడ్ నేషన్స్ కంట పడకూడదని తమ అణ్వాయుధాలను సముద్రం అట్టడుగున దాచేస్తే.. అక్కడ టెక్టానిక్ ప్లేట్స్ కదిలిపోయి.. సముద్రం అడుగున భూకంపం వచ్చి.. వెంటనే అలలు ఒక సునామీగా మారిపోయి.. జపాన్ ను ముంచెత్తుతాయి. ఇది కనిపెట్టిన అమెరికా.. సునామీ భారిన పడకుండా ఏం చేస్తుంది?'' అనేదే కథ. అయితే ఎక్కడో సునామీ వచ్చి ఇండియాలో అది బీభత్సం సృష్టించనప్పుడు.. మా నాన్న గారు ఇలాంటి కథను 25 ఏళ్ళ క్రిందటే చెప్పారే.. సునామీ అనే పేరును అప్పుడే నాతో అన్నారే.. అంటూ రాజమౌళి చాలా గర్వపడ్డాడట.

--మూడో సంఘటన ఏంటంటే.. ఇండియాలోనే రెండు బిగ్గస్టు బ్లాక్ బస్టర్లు అయిన బాహుబలి అండ్ భజరంగీ భాయ్ జాన్ లు రెండు వారాల గ్యాపులో రిలీజ్ కావడం.. ఆ రెండింటికీ తన తండ్రి కథలే ఉండటం.. తనకు చాలా గర్వాన్ని కలిగించిందని చెప్పుకొచ్చాడు ఈ టాప్ నాచ్ డైరక్టర్.

ఇకపోతే శ్రీవల్లి సినిమా సక్సెస్ అవ్వాలంటూ కొడుకుగా తాను గర్వపడతానని.. కాని సాటి దర్శకుడిగా మాత్రం ఆయన సినిమాలోని తప్పులన్నీ వెతికి చెబుతానంటూ కామెంట్ చేశాడు. ''నా సినిమా చూపిస్తే.. ప్రతీ ఫ్రేములోనూ.. బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ తలపాగా బాగాలేదు.. లైటింగ్ సరిగ్గా లేదు అంటూ ఆయన తప్పులు వెతుకుతారు. ఇప్పుడు నేను కూడా అదే చేస్తాను. వెయిట్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట'' అంటూ ముగించాడు.