Begin typing your search above and press return to search.
చిరు ఓకే అంటే సూపరే -రాజమౌళి
By: Tupaki Desk | 25 Jun 2018 4:14 AM GMTమెగా స్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ను హీరోగా లాంచ్ చేస్తూ తెరకెక్కించిన విజేత సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ బజ్ పెంచేలా ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ చేశారు. అందులో భాగంగానే దర్శక ధీరుడు రాజమౌళిని ఈ ఈవెంట్ కు ఇన్వయిట్ చేశారు.
రాజమౌళి తన మెగా అభిమానులను ఉత్సాహపరిచే మాటలు బాగానే చెప్పాడు. ‘‘చిరంజీవి చాలా మంచి యాక్టర్.. మంచి డ్యాన్సర్.. మంచి ఫైటర్. ఇవి అందరికీ తెలిసిన విషయాలు. ఇండస్ట్రీ జనాలకు మాత్రమే తెలిసిన విషయం ఇంకోటుంది. అది చిరుకు స్టోరీని జడ్జ్ చేయడంలో స్పెషల్ స్కిల్ ఉంది. స్టోరీ విన్నవెంటనే అందులోని మంచి చెడులు.. కావాల్సింది ఏమిటి.. లేనిది పర్ ఫెక్ట్ గా చెప్పేస్తారు. మగధీర కథ కూడా ముందుగా చిరంజీవికే చెప్పాం. చిరు ఓకే అన్నారంటే అందరికీ వచ్చే కాన్ఫిడెన్స్ సినిమా బాగుంటుందని.. ఇప్పుడు విజేత కూడా ఆయన ఓకే చేశాకే తీశారు బాలా బాగుంటుందని అనుకుంటున్నాం’’ అంటూ జక్కన్న చిరు జడ్జిమెంట్ పై తనకున్న అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు.
‘‘విజేత స్టార్ట్ చేయడానికి ముందు నిర్మాత సాయి ఇది చిన్న సినిమా అంటూ చెబుతూ వచ్చారు. టెక్నీషియన్స్ గురించి అడిగితే కెమెరా మెన్ గా సెంథిల్ ను పెట్టుకుందామని అనుకుంటున్నామని చెప్పారు. అప్పుడే అర్ధమైంది. ఇది చిన్నసినిమా కాదు.. చాలా పెద్ద సినిమా అవుతుందని. ఇందులో కోడి పాట నాకు బాగా నచ్చింది. నా వైఫ్ పాటలంటే ఇష్టపడదు. తనకు కూడా ఈ పాట బాగా నచ్చేసింది. నా ఫ్యామిలీ మొత్తం ఈ పాటను మెచ్చుకున్నారు’’ అంటూ సినిమాలోని ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకొచ్చాడు రాజమౌళి. వారాహి చలనిత్రం బ్యానర్ పై వస్తున్న విజేత మూవీని రాకేష్ శశి డైరెక్ట్ చేశాడు. కళ్యాణ వైభోగమే ఫేమ్ మాళవిక నాయక్ ఇందులో హీరోయిన్ గా నటించింది.