Begin typing your search above and press return to search.

జక్కన్న దెబ్బకు తమిళోళ్లు ఫ్లాట్

By:  Tupaki Desk   |   10 April 2017 11:15 AM GMT
జక్కన్న దెబ్బకు తమిళోళ్లు ఫ్లాట్
X
తెలుగు ఇండస్ట్రీ ఒకప్పడు మద్రాస్ లో ఉండటం వల్ల మన సినీ జనాలు చాలామందికి తమిళం మీద మంచి పట్టుంది. హీరోలు.. టెక్నీషియన్లు చాలామంది తమిళం మాట్లాడతారు. రాజమౌళి కుటుంబం విషయానికి వస్తే.. 80ల్లోనే వారు మద్రాస్ కు వలస వెళ్లారు. కాబట్టి ఆ కుటుంబంలో దాదాపుగా అందరికీ తమిళం తెలుసు. రాజమౌళి కూడా కొన్నేళ్ల పాటు మద్రాస్ లోనే ఉన్నాడు కాబట్టి అతడికీ తమిళం రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే ఏదో కొంచెం కొంచెం కూడబలుక్కుని తమిళం మాట్లాడటం కాకుండా.. నేటివ్ తమిళియన్ మాదిరిగా ఆయన స్వచ్ఛమైన తమిళం మాట్లాడగలడని ఇప్పుడే అందరికీ అర్థమైంది.

నిన్న చెన్నైలో ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆడియో వేడుక సందర్భంగా రాజమౌళి తమిళంలో చేసిన ప్రసంగం అక్కడి వాళ్లను ఆశ్చర్యపరిచింది. ఎళ్లారుకు వణక్కం అంటూ మొదలుపెట్టి తమిళంలో దంచేశాడు రాజమౌళి. గతంలోనూ ఒక ప్రెస్ మీట్లో రాజమౌళి తమిళంలో మాట్లాడాడు కానీ.. అవి పొడి పొడి మాటలే. కానీ ఆదివారం మాత్రం తన సుదీర్ఘ ప్రసంగంలో తమిళంలో అనర్గళంగా మాట్లాడేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ‘బాహుబలి’ కోసం తమిళ రైటర్ మదన్ కార్కీ రాసిన డైలాగుల్ని కూడా ప్రస్తావిస్తూ.. వాటి నిగూడార్థం గురించి కూడా మాట్లాడాడు జక్కన్న. మామూలుగానే మనోడి ప్రసంగంలో వినమ్రత ఉంటుంది. చాలా ఆసక్తికరంగా మాట్లాడతాడు. పైగా తమిళంలో అక్కడి నేటివిటీతో మాట్లాడటంతో తమిళ జనాలు ఫిదా అయిపోయారంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/