Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ : ఇంట్రోలకే 50 కోట్లా

By:  Tupaki Desk   |   18 April 2019 5:57 AM GMT
ఆర్ ఆర్ ఆర్ : ఇంట్రోలకే 50 కోట్లా
X
ప్రస్తుతం రామ్ చరణ్ కు కలిగిన గాయం వల్ల చిన్న బ్రేక్ లో ఉన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ అతి త్వరలో రీ స్టార్ట్ కాబోతోంది. రేపో ఎల్లుండో డాక్టర్లు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత చరణ్ తారక్ లు కలిసి మళ్ళి బయలుదేరతారు. షూటింగ్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ షేర్ కాకుండా జాగ్రత్త పడుతున్న జక్కన్న లీక్స్ ని మాత్రం ఆపలేకపోతున్నాడు. అయితే అవి అభిమానులకు మాంచి హుషారు ఇచ్చేలా ఉండటంతో ఎప్పటికప్పుడు వీటి మీద ఆసక్తి పెరిగిపోతోంది.

తాజాగా వచ్చిన సమాచారం మేరకు రాజమౌళి నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో ఎపిసోడ్ షూట్ చేయబోతున్నాడట. గతంలో ఫస్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్ ది పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తారక్ వంతు వచ్చింది. ఇది అయ్యాక అజయ్ దేవగన్ స్పెషల్ ఎపిసోడ్ లో ఇంట్రో కూడా ఓ రేంజ్ లో ఉంటుందట. మొత్తం ఈ మూడు ఎపిసోడ్లకు కలిపి సుమారు 50 కోట్ల దాకా ఖర్చు పెట్టనున్నట్టు టాక్.

కేవలం ఐదు నుంచి పది నిమిషాల లోపే ఉండే ఇంట్రో సీన్స్ కే ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని రాజమౌళి ఏ రేంజ్ లో తీయబోతున్నాడో ఊహించుకుంటేనే ఒంట్లో జలదరింపు వస్తోంది. 400 కోట్ల దాకా బడ్జెట్ తో తెలుగులోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ రికార్డు సృష్టిస్తున్న ఆర్ ఆర్ ఆర్ కు లైఫ్ అఫ్ పై జంగల్ బుక్ లాంటి సినిమాలు చేసిన టెక్నీషియన్స్ పని చేయబోతున్నారు.

మాములు హీరోలానే ఓ రేంజ్ లో చూపించే నేను ఇక అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ లను ఎలా చూపిస్తానో ఊహించుకోండి అన్న రాజమౌళి అన్నట్టుగానే ఇంట్రోలానే ఇలా ప్లాన్ చేశాడు అంటే చరణ్ తారక్ ల కాంబో సన్నివేశాలు ఎలా ఉంటాయో. చరణ్ సరసన అలియా భట్ కన్ఫర్మ్ అయిన ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ జోడిని ఇంకా సెట్ చేయాల్సి ఉంది