Begin typing your search above and press return to search.
సైజ్ జీరోకు, రాజమౌళికి సంబంధమేంటి?
By: Tupaki Desk | 24 Nov 2015 11:30 AM GMTతనకేదైనా సినిమా నచ్చితే సోషల్ మీడియాలో దాన్ని ఎండోర్స్ చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయడు రాజమౌళి. చిన్న, పెద్ద అని తేడా లేకుండా తనకు నచ్చిన ట్రైలర్ల మీద.. సినిమాల మీద కామెంట్స్ పోస్ట్ చేస్తుంటాడు జక్కన్న. తనకు దగ్గరి వాళ్లెవరైనా సినిమాలు తీస్తే ఆడియో ఫంక్షన్ లకు కూడా వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పి పోతుంటాడు. ఇంకా ఆప్తులైతే.. రషెస్ చూసి మార్పలు చెప్పడం, స్క్రిప్టు దశలోనూ కొన్ని సలహాలివ్వడం చేస్తుంటాడని సన్నిహితులు చెబుతుంటారు. ‘సైజ్ జీరో’కు అలాంటి సాయం చాలానే చేశాడట జక్కన్న.
తన గురువు రాఘవేంద్రరావు తనయుడు, తనకు సన్నిహితుడు అయిన ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. పైగా తన అన్నయ్య కీరవాణి సంగీతాన్నందించాడు. తనకు బెస్ట్ ఫ్రెండ్ అయిన అనుష్క ప్రధాన పాత్రలో నటించింది. ఈ కారణాలు చాలవా.. జక్కన్న ‘సైజ్ జీరో’ మీద శ్రద్ధ చూపించడానికి. టాకీ పార్ట్ పూర్తయిన దశలోనే సినిమా చూసి.. తనకు తోచిన సలహాలు చెప్పాడట రాజమౌళి. అపజయమే లేని దర్శకుడిగా వెలుగొందుతున్న జక్కన్న మార్పులు చెబితే విని ఎలా వదిలేస్తారు. ప్రకాష్ అండ్ టీం ఆ మార్పులు వంద శాతం అమలు చేసిందట. దీంతో సినిమా మరింత బాగా తయారైందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.