Begin typing your search above and press return to search.
#RRR:రాజమౌళి బయట పెట్టనిది అందుకేనా?
By: Tupaki Desk | 2 Jan 2020 4:07 AM GMTకొత్త సంవత్సరం వచ్చింది.. మొదట రోజు గడిచింది. నిన్నంతా తారల సినిమాల కొత్త అప్ డేట్లు వస్తాయా అన్న టెన్షన్ తో ఫ్యాన్స్ ఎదురుచూశారు. బాహుబలితో దేశం గర్వించేలా చేసిన మన రాజమౌళి ప్రతిష్టాత్మకం గా తీస్తున్న #RRR మూవీ పై ఏదైనా అప్ డేట్ వస్తుందని అందరూ కళ్లు కాయలు కాసి పండ్లు పండేలా ఎదురు చూశారు. కానీ.. ప్చ్.. రాజమౌళి నిరాశ పరిచాడు. ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ను నిరాశ లోకి నెట్టాడు.
#RRR మూవీ గురించి నూతన సంవత్సరం వేళ ఏదైనా అప్ డేట్ వస్తుందని అందరూ గంపెడాశలు పెట్టుకున్నా రాజమౌళి కనికరించలేదు. ప్లాన్ చేయలేదు. ఎందుకిలా అంటే ఆ సినిమా కథనే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు..
బాహుబలి సినిమాకు కథనే బలం.. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అనేది టాప్ ట్రెండింగ్ లోకి వెళ్లి ప్రధాని మోడీ కూడా ఎన్నికల ప్రచార సభల్లో పలికాడంటే అర్థం చేసుకోవచ్చు. బాహుబలి కథను రిలీవ్ చేస్తే అంతా ఎవరూ చూడరు. ఇంట్రస్ట్ రాదు.. కథే బాహుబలికి బలం.. బలగం.. అందుకే మొదటి నుంచి దాన్ని బయటపెట్టకుండా రాజమౌళి రహస్యంగా ఉంచారు.
అయితే #RRR మూవీ అలా కాదు.. పూర్తిగా కథనం పై ఆధారపడే మూవీ.. ఇప్పటికే కథ ఏంటనేది ముందే చెప్పేశాడు రాజమౌళి.. కొమురంభీం, అల్లూరి సీతరామరాజులు ఎలా విప్లవ కారులుగా ఎదిగారన్నది మూల కథ. ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తిగా దీన్ని కథగా మలిచానని చెప్పాడు. చివరికి మాత్రమే వారు వీరులని తెలుస్తుందట.. వారు చిన్నప్పటి నుంచి అలా ఎలా మారుతారన్నది పూర్తి గా స్క్రీన్ ప్లే మీద ఆధారపడి నడిచే కథ. కాబట్టే రాజమౌళి ఎక్కడా లీకులు ఇవ్వడం లేదు. కథ కీలకం అయితే పోస్టర్లు, లుక్ లు, టీజర్ లు ఇవ్వొచ్చు. కానీ స్క్రీన్ ప్లే కీలకంగా ఉన్న సినిమాలను తొందర గా రిలీవ్ చేస్తే ఆ ఉత్కంఠ అనేది ఉండదు. అందుకే రాజమౌళి తెలివి గా ఎన్టీఆర్, రాంచరణ్ సహా ఎవ్వరి పై నూతన సంవత్సర కానుకగా ఎలాంటి సమాచారం లీక్ చేయలేదని అంటున్నారు.