Begin typing your search above and press return to search.
యేడాది చాలంటున్న రాజమౌళి
By: Tupaki Desk | 15 July 2015 4:29 AM GMT`బాహుబలి` తొలి పార్ట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి జక్కన్నకి మూడున్నరేళ్లు పట్టింది. ఒకదశలో `సినిమాని ఇంకెప్పుడు రిలీజ్ చేస్తార్రా బాబూ..` అంటూ ప్రేక్షకులు అసహనానికి కూడా గురయ్యారు. ఆ విషయాన్ని తెలుసుకొన్న రాజమౌళి మరింతగా వెయిట్ చేయించకుండా రేయింబవళ్లు కష్టపడి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఎట్టకేలకు సినిమా విడుదలైంది, థియేటర్లలో వసూళ్ల ప్రభంజనం కూడా సృష్టిస్తోంది. అయితే తొలి పార్ట్‌ని చూసిన ప్రేక్షకుడు `ఇక్కడ కథేమీ లేదనీ, రెండో పార్ట్ ఎప్పుడు చూపిస్తార`ని ఆరా తీయడం మొదలుపెట్టాడు. రెండో పార్ట్‌కి కూడా మూడేళ్లు తీసుకొంటారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
అయితే జక్కన్న మాత్రం బాహుబలి కంక్లూజన్‌కి యేడాది సమయం చాలంటున్నాడు. కథానాయకుడు ప్రభాస్, ఇతర చిత్రబృందానికి ఇప్పటికే రాజమౌళి కబురు పెట్టినట్టు తెలుస్తోంది. చేస్తున్న పనులు వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకొని `బాహుబలి2`కి సిద్ధం కావాలని జక్కన్న కోరాడట. తొలి పార్ట్ ఫలితాన్ని చూసుకొని వీలైతే... మధ్యలో సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకొన్నాడు ప్రభాస్. కానీ అభిమానుల నుంచి రెండో పార్ట్ సినిమా గురించి అప్పుడే ఒత్తిడి పెరగడంతో ఆయన కూడా మరే సినిమా ఒప్పుకోకుండా డైరెక్టుగా బాహుబలి2 కోసం రంగంలోకి దిగాలని ఫిక్సయ్యాడు. ఆ సినిమాకి సంబంధించి జక్కన్న దగ్గర ఇప్పటికే బోలెడంత రషెస్ ఉన్నట్టు సమాచారం. ఇక నలభై శాతం సన్నివేశాల్ని తెరకెక్కించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తే సరిపోతుందట. అందుకే రాజమౌళి కాన్ఫిడెంట్‌గా యేడాది సమయం చాలంటున్నాడు.