Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ విషయంలో జక్కన్న చాలా స్ట్రిక్ట్ గా...!
By: Tupaki Desk | 13 Dec 2018 4:26 AM GMTరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం కోసం సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మల్టీస్టారర్ చిత్రం కోసం రోజుకో వార్త ఏదో ఒక రకంగా మీడియాలో ఉంటూనే ఉంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల లుక్ ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ హెయిర్ స్టైల్ మార్పు తప్ప అంతా సేమ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ మాత్రం చాలా విభిన్నంగా కనిపిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి.
అరవింద సమేత చిత్రంతో పోల్చితే మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా కనిపించడంతో పాటు - మంచి ఫిజిక్ తో అలరించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. దాంతో ఎన్టీఆర్ లుక్ కోసం నందమూరి ఫ్యాన్స్ తో పాటు అందరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఫిజికల్ గా సిద్దం అవుతున్నాడట. ఎన్టీఆర్ కు సంబంధించిన చిన్న పిక్ కాని - వీడియో కాని బయటకు రాకుండా జాగ్రత్త పడాలని జక్కన్న భావిస్తున్నాడు.
ఇటీవల ఎన్టీఆర్ ఓటు వేసేందుకు బయటకు వచ్చిన విషయం తెల్సిందే. ఎన్నికల రోజే ఎన్టీఆర్ కాస్త లావుగా కనిపించాడు. ఇంకా రెండు నెలల పాటు ఎన్టీఆర్ వర్కౌట్స్ చేయనున్నట్లుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ వర్కౌట్స్ చేస్తున్న వీడియో కాని - ఫొటోలు కాని - ఆన్ సెట్స్ ఫొటోలు కాని ఏవి కూడా బయటకు రాకుండా ఉండాలని జక్కన్న స్ట్రిక్ట్ గా నిర్ణయించుకున్నాడట.
ఈమద్య కాలంలో స్టార్స్ పిక్స్ లీక్ కాకుండా ఆపడం పెద్ద కష్టం అయ్యింది. అయితే జక్కన్నకు అది పెద్ద కష్టం కాకపోవచ్చు. ఆయన తీసుకునే జాగ్రత్తల వల్ల ఎన్టీఆర్ లుక్ ఆయన అనుకున్నప్పుడు మాత్రమే బయటకు వస్తుందని సినీ వర్గాల వారు భావిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ రెండవ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ఉంటుందని సమాచారం అందుతోంది.