Begin typing your search above and press return to search.
#RRR.. RRR అంతే.. అంటున్న జక్కన్న
By: Tupaki Desk | 18 April 2020 11:30 PM GMTదర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్.ఆర్.ఆర్)... ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ 'అల్లూరి సీతారామ రాజు' రోల్ పోసిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉగాది పండగ సందర్భంగా ఈ చిత్రానికి సంభందించి ‘రౌద్రం రణం రుధిరం' టైటిల్ అనౌన్స్ మెంట్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేసారు చిత్ర బృందం. అయితే ఈ సినిమాకి అలాంటి టైటిల్ విని చాలా మంది పెదవి విరిసిన మాట వాస్తవం. అందులోనూ ఒక్కొక్క భాషకి ఒక్కొక టైటిల్ పెట్టడంతో దీన్ని యూనివర్సల్ మూవీగా ఎలా జనాల్లోకి తీసుకెళ్తారని అందరూ డౌట్ పడ్డారు.
నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ టైటిల్ విషయంలో చాలా తర్జన భర్జనలు జరిగాయట. ఆర్.ఆర్.ఆర్ అనేది వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నారు జక్కన్న టీమ్. కానీ తర్వాత రోజుల్లో అది జనంలోకి బాగా వెళ్లడంతో దానికి సరిపోయేలా టైటిల్స్ సూచించమని అభిమానుల్ని కోరింది చిత్రబృందం. చివరకు 'రౌద్రం రణం రుధిరం' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. అయితే ఈ టైటిల్ జనంలోకి పెద్దగా వెళ్ల లేదనే చెప్పవచ్చు. సినిమా టైటిల్ 'రౌద్రం రణం రుధిరం' అయినా సరే.. అందరూ ఈ సినిమాని 'ఆర్.ఆర్.ఆర్' అనే పిలుస్తున్నారు. రాజమౌళి కూడా ఈ సినిమా పేరు 'ఆర్.ఆర్.ఆర్' అనే సంబోధిస్తున్నాడు.
ఈ నేపథ్యం లో రాజమౌళి ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ''పాన్ ఇండియా మూవీగా పలు భారతీయ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి అన్ని భాషల్లోనూ ఒకే యూనివర్సల్ టైటిల్ ఉండాలి. మార్కెట్ పరంగా చూసుకుంటే అదే కరెక్టు. అయితే 'ఆర్.ఆర్.ఆర్' అనే దానికి ఓ అర్థం అంటూ ఉండాలన్న ఉద్దేశంతో ప్రతీ భాషకూ ఓ టైటిల్‌ని ప్రకటించాం. కానీ దానికి పెద్దగా ప్రాధాన్యం లేదు.. మేం కూడా దీన్ని ఆర్.ఆర్.ఆర్ అనే పిలుస్తున్నాం.. ప్రేక్షకులు, అభిమానులు, సినిమా వాళ్లు అందరూ దీన్ని ఆర్.ఆర్.ఆర్ అనే అంటున్నారు. సో.. దీని టైటిల్ కూడా అదే'' అని చెప్పాడట రాజమౌళి.
వాస్తవానికి ఓ సందర్భంలో ‘ఆర్.ఆర్.ఆర్’కి అబ్రివేషన్లు ఏమీ ఇవ్వకుండా టైటిల్ అలానే ఉంచేద్దాం అనుకున్నారట. కానీ టైటిల్ కి ఏదో ఒక మీనింగ్ ఉండాలన్న ఉద్దేశ్యంతో అలా అన్ని భాషల్లో టైటిల్ కి అబ్రివేషన్లు ఇచ్చారట. అయినా జనాల్లో ఈ సినిమా ఆర్.ఆర్.ఆర్ గానే స్థిరపడిపోయింది. వాస్తవానికి రాజమౌళి గత చిత్రం 'బాహుబలి'ని తీసుకున్నా యూనివర్సల్ టైటిల్ కారణంగా అది జనాల్లోకి బాగా ఎక్కింది.. మార్కెట్ పరంగా కూడా ఇది బాగా వర్క్ అవుట్ అయింది. సో.. ఆర్ ఆర్ ఆర్... ఆర్.ఆర్.ఆర్ అంతే.