Begin typing your search above and press return to search.
ఆర్ ఆర్ ఆర్ కోసం ఎంతైనా తిరగాలంటున్నారు
By: Tupaki Desk | 3 April 2019 9:33 AM GMTటాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతోంది. అందుకే మన మీడియాకు దానికి సంబంధించిన ఎలాంటి లీక్స్ కానీ అప్ డేట్స్ కానీ అందకుండా పోయాయి. ఇదీ ఒకరకంగా మంచికే అనుకుంటున్న జక్కన్న అక్కడ ఏకంగా నెలన్నర పాటు షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నాడు.
ఇంత లాంగ్ అవుట్ డోర్ లో చరణ్ కానీ తారక్ గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేరు. ఈ విషయంలో విదేశాలను మినహాయించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో జాతీయ మీడియాలో అడిగిన దానికి రాజమౌళి స్పష్టమైన సమాధానం ఇస్తున్నాడు.
కథ ప్రకారం నార్త్ లో చాలా కీలకమైన ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి సహజత్వం కోసం ఇక్కడిదాకా వచ్చామని చెబుతున్నాడు. వడోదర అయ్యాక మహారాష్ట్ర వెళ్లి అక్కడ పూణేలో కీలకమైన భాగం షూట్ చేసుకుని ఆపై ప్లానింగ్ ఏంటి అనేది అప్పుడు రివీల్ చేస్తారట.
చరణ్ తారక్ లు షూటింగ్ తో పాటు హాలిడే తరహాలో టైంని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనుకోకుండా బయటికి వచ్చిన ఓ వీడియోలో నిన్న బయట పడిన సంగతి తెలిసిందే. సో బాహుబలి తరహాలో ఆర్ ఆర్ ఆర్ ఏదో ఫిలిం సిటీలో సెట్ వేసుకుని పని కానిచ్చే రకం కాదు. దేశమంతా తిరగాల్సి వచ్చేలా ఉంది. అందుకేగా ఏడాదికి పైగా ఇద్దరు హీరోల డేట్స్ ని రాజమౌళి లాక్ చేసుకున్నాడు. ఇంకో ఏడాది టైం ఉన్నప్పటికీ దీని మీద ఉత్సుకత అభిమానుల్లో అంతకంతా ఎక్కువవుతోంది కానీ తగ్గే సూచనలు కనిపించడం లేదు