Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ .. చరణ్ లతో రాజమౌళి వీటిని గురించే మాట్లాడేవారట!

By:  Tupaki Desk   |   31 Oct 2021 11:35 AM GMT
ఎన్టీఆర్ .. చరణ్ లతో రాజమౌళి వీటిని గురించే మాట్లాడేవారట!
X
ఎన్టీఆర్ .. చరణ్ కాంబినేషన్లో రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను రూపొందించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ .. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ సినిమా కథాకథనాల విషయంలో అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఉన్నారు. జనవరి 7వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వస్తున్న అప్ డేట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ కూడా రాజమౌళితో ఎక్కువకాలం గడిపారు.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరూ కూడా కలిసే ఎక్కువగా షూటింగులు పాల్గొన్నారు. కొన్ని సందర్భాలలో కొన్నాళ్లు ఎన్టీఆర్ తో షూటింగు కొనసాగితే, మరికొన్నాళ్లు చరణ్ తో షూటింగు నడిచేది. ఈ సినిమా కోసం ఇన్నేళ్లపాటు షూటింగు జరిగినప్పుడు, విరామ సమయాల్లో రాజమౌళి - ఎన్టీఆర్, రాజమౌళి - చరణ్ ఏం మాట్లాడుకుని ఉంటారనే ఒక ఆసక్తిని అందరిలో తప్పకుండా ఉంటుంది. ఏ అంశాలపై వాళ్లు మాట్లాడుకుని ఉంటారనే ఆసక్తి తలెత్తుతుంది. ఇదే విషయాన్ని ఇటీవల రాజమౌళి దగ్గర ప్రస్తావించగా ఆయన సమాధానమిచ్చారు.

ఒక సినిమాకి సంబంధించిన పూర్తి కథాకథనాలను గురించి .. నటన సంబంధమైన విషయాలను గురించి ముందుగా నేను ఒక వ్యక్తితో మాట్లాడదలచుకుంటే ఆ వ్యక్తి ఎన్టీఆర్ అయ్యుంటాడు. ఆ అంశాలకి సంబంధించిన విషయాలను నేను ఎన్టీఆర్ తోనే ఎక్కువగా పంచుకుంటాను. ఆయనతో ఈ అంశాలను గురించి ఎంతసేపైనా మాట్లాడవచ్చు. ఇక జంతువులు అంటే నాకు ప్రాణం. వాటితో గడపటానికి ఎక్కువగా ఇష్టపడతాను .. ఎంత సమయమైనా కేటాయిస్తాను. వాటికి సంబంధించిన విషయాలను చరణ్ తో ఎక్కువగా పంచుకుంటాను. ఎందుకంటే చరణ్ కి జంతువులంటే ఎంతో ఇష్టం" అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. అందుకు సంబంధించిన కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఇక ఆ తరువాత సినిమాను ఆయన మహేశ్ బాబుతో చేయనున్నారని అంటున్నారు. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ కి సంబంధించిన కథ అని చెప్పుకుంటున్నారు. ఇంతవరకూ ప్రభాస్ .. ఎన్టీఆర్ .. చరణ్ లతో సినిమాలను రాజమౌళి రిపీట్ చేశారు. కానీ మహేశ్ బాబుతో మాత్రం అసలు చేయలేదు. అందువలన ఈ కాంబినేషన్ పై అందరిలో ఆసక్తి ఉంది. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.