Begin typing your search above and press return to search.

చైనా మార్కెట్లోకి జక్కన్న దూకుడు

By:  Tupaki Desk   |   8 Aug 2015 6:40 AM GMT
చైనా మార్కెట్లోకి జక్కన్న దూకుడు
X
చైనా ఉత్పత్తులకు ప్రపంచ దేశాల్లో ఉన్న గిరాకీ ఎలాంటిదో తెలిసిందే. తక్కువ ఖర్చుతో తయారు చేసి, మినిమం ఖరీదులో వస్తువుల్ని అమ్మడం చైనా పాలసీ. ఈ ఫార్ములాతో ప్రపంచాన్ని ఒణికించింది చైనా. విస్త్రతంగా ఉన్న మానవ వనరుల్ని వినియోగించి ప్రపంచ మార్కెట్‌ లోకి దూసుకుపోయింది. జనాభాలో ప్రపంచంలోనే నంబర్‌ -1 దేశం కాబట్టి .. ఇప్పుడు చైనా లో వినోద పరిశ్రమకు ఆదరణ కూడా అలానే ఉంది.

ఇటీవలే అమీర్‌ ఖాన్‌ నటించిన పీకే చిత్రం చైనాలో 100కోట్లు పైగా వసూలు చేసింది. అంటే సరైన కాన్సెప్టు తో వెళితే అక్కడ మార్కెట్‌ ని కూడా భారతీయ సినిమాలు చేజిక్కించుకోవచ్చని ఈ సినిమా నిరూపించింది. అందుకే ఇప్పుడు జక్కన్న దృష్టి అటు మళ్లిందని చెబుతున్నారు. ప్రపంచ మార్కెట్‌ ని తెలుగు సినిమా అందుకోవాలన్న దాహం అతడిలో రోజురోజుకి పెరిగిపోతోంది. బాహుబలి ఫలితం అతడిలో నూతనోత్సాహాన్ని నింపింది.

భారత్‌ కంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా లో సినిమా రిలీజ్‌ చేయగలిగితే మార్కెట్‌ అసాధారణంగా ఉంటుందని భావిస్తున్నాడు. అందుకోసం యూనివర్శల్‌ కాన్సెప్టు ఉన్న కథాంశాల్ని ఎంచుకుని సినిమాలు తీయాలనుకుంటున్నాడు. అయితే అందుకు ఇంకా సమయం ఉంది. బాహుబలి 2 పూర్తయ్యాక .. దానికి సంబంధించిన ప్రణాళికలు ఉంటాయన్నమాట!