Begin typing your search above and press return to search.

బాహుబలికి కిలికి.. మరి #RRR కి?

By:  Tupaki Desk   |   12 Nov 2018 4:39 PM GMT
బాహుబలికి కిలికి.. మరి #RRR కి?
X
రాజమౌళి తాజా చిత్రం #RRR ఈమధ్యే ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సినిమా ప్రారంభానికి ఎడాది ముందు నుండి ఈ సినిమాపై ఎన్నో స్పెక్యులేషన్లు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో నిజాలెన్నో అబద్ధాలన్నో తెలియదు గానీ తాజాగా ఆ రూమర్ల లిస్టు లో మరో కొత్తది వచ్చి చేరింది. అదేంటంటే #RRR కి కొత్త భాష.

'బాహుబలి' సినిమాకోసం జక్కన్న కిలికి అనే కొత్త భాషను సృష్టించిన సంగతి తెలిసిందే. ఐడియా జక్కన్నదేగానీ ఈ భాషను రూపొందించింది మాత్రం తమిళ రచయిత మదన్ కార్కి. కొత్త భాష అనగానే ఏవో పిచ్చి పదాల సమాహారం లా కాకుండా ఒక నిజమైన భాష ఎలా ఉంటుందో అలా ఉండేలా కిలికి భాషనూ రూపొందించారు. ఇప్పుడు #RRR కోసం మరో కొత్త భాషను సృష్టించేందుకు మదన్ తో కలిసి కసరత్తు చేస్తున్నాడట జక్కన్న. ఈ సినిమాలో ఎన్టీఆర్ పలికే సంభాషణల్లో కొన్ని ఈ భాషలో ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట.

మరి ఇది నిజమా జస్ట్ రూమరా తెలీదుగానీ ఈ సినిమాపై రోజుకో వార్త వస్తోంది. రాజమౌళి ఈ సినిమా గురించి రోజూ ఏదో ఒక అప్డేట్ చెప్తే గానీ ఈ స్పెక్యులేషన్లు ఆగేలా లేవు. ఈ సినిమా రిలీజుకు కనీసం ఏడాదిన్నర సమయం ఉంటుంది. అప్పటిలోపు ఎన్ని రూమర్లు వస్తాయో. ఇవన్నీ కౌంట్ చేసుకుంటూ పోతే ఒక సినిమా పై వచ్చిన అత్యధిక రూమర్లు #RRR మీదే అని గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కే అవకాశం ఉంది. ఏమంటారు?