Begin typing your search above and press return to search.
మహేష్ కోసం రాజమౌళి టెర్రిఫిక్ ప్లాన్?
By: Tupaki Desk | 28 Oct 2022 1:30 AM GMT`RRR`తో వరల్డ్ వైడ్ గా సంచలనాలు సృష్టిస్తున్న జక్కన్న ప్రస్తుతం ఈ మూవీని జపాన్ లో ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి జపాన్ వెళ్లిన రాజమౌళి ఈ భారీ పాన్ ఇండియా వండర్ ని అక్కడ ప్రమోట్ చేస్తూ పలు జపాన్ మీడియా హౌస్ లతో ప్రత్యేకంగా ముచ్చటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో చేయబోతున్న ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆసక్తికర విశేషాల్ని వెల్లడిస్తూ భారీ హైప్ ని క్రియేట్ చేస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఈ భారీ ప్రాజెక్ట్ కు జక్కన్న వచ్చే ఏడాది శ్రీకారం చుట్టబోతున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ప్రి ఇండిపెండెన్స్ ఎరా నేపథ్యంలో `RRR` ని రూపొందించిన రాజమౌళి ఈ సారి అంతకు మించి అనే స్థాయి మూవీని అందించబోతున్నాడు. లాక్ డౌన్ టైమ్ లో ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా వెల్లడించిన రాజమౌళి అప్పటి నుంచి `RRR` పనుల్లో బిజీగా వుండటం వల్ల మహేష్ తో చేయబోతున్న సినిమా స్క్రిప్ట్ ని ఫినిష్ చేయలేకపోయారు.
ఫైనల్ గా తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మూడు లన్ లలో ఓ లైన్ ని ఫైనల్ చేసుకున్న రాజమౌళి `RRR` రిలీజ్ తరువాత నుంచి ఆ లైన్ పై వర్క్ చేయడం మొదలు పెట్టారు. గత కొన్ని రోజులుగా ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో అబ్బుర పరిచే యాక్షన్ సన్నివేశాలతో ఈ మూవీని సర్వాంగ సుందరంగా ఇంటర్నేషనల్ మూవీగా తెరపైకి తీసుకురావాలని కసరత్తులు మొదలు పెట్టారు.
ఇదిలా వుంటే ఇటీవల జాపాన్ లో ఓ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రాజమౌళి .. మహేష్ తో చేయబోతున్న యాక్షన్ అడ్వెంచర్ పై ఆ సక్తికర విషయాలని చెప్పుకొచ్చారు. తదుపరి ప్రాజెక్ట్ ని సూపర్ స్టార్ మహేష్ తో చేయబోతున్నానని, ఇదొక యాక్షన్ అడ్వెంచర్ అని, ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించే కథ ఇదని, అంతే కాకుండా సినిమాలోని కీలక యాక్షనర్ ఘట్టాల్లో ఓ దాన్ని జపాన్ లో షూట్ చేస్తానని వెల్లడించాడు.
ఈ వార్త విని మహేష్ అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన కీలక యాక్షన్ ఘట్టం ఇదే నంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం జక్కన్న మహేష్ పై నరమాంస భక్షకుల నేపథ్యంలో ఓ టెర్రిఫిక్ యాక్షన్ ఘట్టాన్ని ప్లాన్ చేస్తున్నాడని, ఇది సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కె.ఎల్. నారాయణ ఈ మూవీని నిర్మించబోతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.