Begin typing your search above and press return to search.

ఈ స్థాయిలో.. ఊహించలేదు-రాజమౌళి

By:  Tupaki Desk   |   14 July 2015 12:08 PM GMT
ఈ స్థాయిలో.. ఊహించలేదు-రాజమౌళి
X
నిజమే రాజమౌళి కూడా బాహుబలికి మరీ ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని.. బాలీవుడ్‌తో పాటు ఇంటర్నేషనల్ మీడియా కూడా తనపై ఈ స్థాయిలో ప్రశంసలు కురిపిస్తుందని ఊహించి ఉండడు. నాలుగు రోజులుగా బాహుబలిపై కురుస్తున్న ప్రశంసల్ని ఆస్వాదిస్తూ గడిపిన జక్కన్న ఎట్టకేలకు తన స్పందన తెలియజేశాడు. సినిమా విడుదలయ్యాక వేరే ట్వీట్లను రీట్వీట్ చేశాడు తప్పితే స్వయంగా తనేమీ మాట్లాడలేదు. ఐతే ఎట్టకేలకు మంగళవారం సినిమాకు వస్తున్న రెస్పాన్స్ గురించి ట్వీట్లు చేశాడు జక్కన్న.

‘‘నాకు గొప్ప మద్దతుగా నిలుస్తున్న ట్విట్టర్ స్నేహితులందరినీ పెద్ద థ్యాంక్స్. నిర్మొహమాటంగా చెప్పాలంటే.. బాహుబలి సినిమాకు ఇంత భారీ స్థాయిలో ఆదరణ దక్కుతుందని కానీ.. ఆరంభంలో వచ్చిన విమర్శల్ని కానీ అసలు ఊహించలేదు. ఐతే ప్రపంచవ్యాప్తంగా అన్ని వైపుల నుంచి అన్ని వర్గాల నుంచి మాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మా ఆనందానికి అవధుల్లేకుండా పోయిది. మా టీమ్ తరఫున అందరికీ ధన్యవాదాలు. ఎందరో సెలబ్రెటీలు బాహుబలి గురించి మంచి మాటలు చెప్పారు. వాళ్లందరికీ కృతజ్నతలు చెప్పదలుచుకున్నా’’ అని రాజమౌళి ట్వీట్ చేశాడు.