Begin typing your search above and press return to search.
వైజాగ్ టాలీవుడ్ లో రాజమౌళి ఫిలింస్టూడియో?
By: Tupaki Desk | 10 Jun 2020 6:00 AM GMTవైజాగ్ టాలీవుడ్.. ప్రస్తుతం హాట్ టాపిక్. బీచ్ సొగసుల విశాఖ నగరంలో ఫిలింఇండస్ట్రీ పాదుకోవాలన్నది ప్రస్తుత సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా స్థానిక మంత్రులు పలువురు సినీపెద్దల ఉబలాటం. చాలా కాలంగా ఇది ఆలోచనల్లోనే ఉన్నా రాజధాని వ్యవహారం తేలకపోవడంతో అంతకంతకు ఆలస్యమవుతోంది. తేదేపా హయాంలోనూ వైజాగ్ టాలీవుడ్ అన్న కాన్సెప్ట్ ఉన్నా.. చంద్రబాబు పూర్తిగా అమరావతి రాజధాని నిర్మాణంపైనే దృష్టి సారించడంతో సినీపరిశ్రమ వ్యవహారాన్ని మర్చిపోయారు.
తాజాగా ఏపీసీఎం జగన్ టాలీవుడ్ పెద్దలతో భేటీ అవ్వడంతో మరోసారి వైజాగ్ టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. ఇక అమరావతిలో అడుగుపెట్టిన టాలీవుడ్ ప్రముఖులలో మెగాస్టార్ చిరంజీవి సహా దర్శకధీర రాజమౌళి ఒకరు. నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడంపై సుదీర్ఘ మంతనాలు సాగించారు.
సమావేశం అనంతరం రాజమౌళి ఏపీ సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. థియేటర్ యజమానులను దెబ్బతీసిన ప్రపంచ సంక్షోభ సమయంలో పరిశ్రమకు ఆశలు కల్పించినందుకు సిఎంకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. థియేటర్లలో కనీస స్థిర విద్యుత్ ఛార్జీలను మాఫీ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని రాజమౌళి ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ అనంతరం రాజమౌళి అభిమానుల్లో ఆసక్తికర డిబేట్ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి సహా ఎస్.ఎస్.రాజమౌళి వైజాగ్ లో ఫిలింస్టూడియోల నిర్మాణంపై ఆసక్తిగా ఉన్నారని.. అందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారన్న చర్చా ఆసక్తిని రేకెత్తించింది.