Begin typing your search above and press return to search.
జక్కన్న తర్వాతి హీరో.. బన్నీనేనా?
By: Tupaki Desk | 30 April 2017 8:35 AM GMTఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలే. ఇద్దరు తెలుగు వాళ్లే కాదు.. ఇద్దరు భారతీయులు కలిస్తే.. వారు మాట్లాడుకునే మాటల్లో తప్పనిసరిగా వచ్చే టాపిక్ గా బాహుబలి మారింది. బాహుబలి 1 కు ముందు.. ఆ సినిమా అంత భారీగా వసూళ్ల వర్షం కురిపిస్తుందన్న నమ్మకం ఎలా లేదో.. సెకండ్ పార్ట్ కలెక్షన్లు వెయ్యి కోట్లు క్రాస్ చేస్తుందన్న మాట చెప్పినప్పుడు కొంతమంది పల్చగా నవ్వేశారు. వెయ్యి కోట్లా? అన్న లెక్కను జీర్ణించుకోలేక వచ్చిన నవ్వుగా చెప్పక తప్పదు.
కానీ.. విడుదలైన తర్వాత సీన్ మొత్తం మారింది. మొదటి రోజు కలెక్షన్లే వంద కోట్ల ను అవలీలగా దాటేసి.. ఈ మూవీకి ఇవాళ.. రేపు కూడా తిరుగులేదు (ఆదివారం.. సోమవారం (మేడే) రెండు రోజులూ హాలిడేనే). అంటే.. శుక్రవారం నుంచి సోమవారం వరకూ నాన్ స్టాప్ గా సెలవులే అయిన నేపథ్యంలో కలెక్షన్ల వర్షం కురవటం ఖాయమన్న మాటను చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు చెబుతున్నారు.
ఇలా.. బాహుబలి మూవీ గురించిన ముచ్చట్లు మాట్లాడుకుంటున్న వేళ.. రాజమౌళికి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ఆయన తర్వాతి సినిమాకు హీరో ఎవరన్న విషయం మీద ఉన్న కన్ఫ్యూజన్ కు తెర దించే మాట ఒకటి వినిపిస్తోంది.
బాహుబలి తర్వాతి సినిమా ఒక మీడియం రేంజ్ సినిమా ఉంటుందని.. ఆ సినిమాలో గ్రాఫిక్స్ అనేవే లేవని తేల్చేసిన వేళ.. ఆ సినిమాలో హీరో ఎవరన్న డౌట్ కు సమాధానం రాని పరిస్థితి. ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ మూవీలో బన్నీనే హీరోగా చెబుతున్నారు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో డీజే నటిస్తున్న బన్నీ.. తర్వాత లింగుస్వామితో సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే.. అనుకోని రీతిలో జక్కన్న ప్రాజెక్టు తెర మీదకు రావటంతో.. డీజే తర్వాతి సినిమా రాజమౌళిదే అవుతుందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. లింగుస్వామి మూవీని సైడ్ ట్రాక్ కు తీసుకెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అధికారికంగా ఈ సమాచారం వెలువడనప్పటికీ.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జక్కన్న తర్వాతి హీరో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జునే అని చెబుతుండటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/