Begin typing your search above and press return to search.

జపాన్ వెళ్ళనున్న బాహుబలి నటుడు

By:  Tupaki Desk   |   26 Jun 2018 4:54 PM IST
జపాన్ వెళ్ళనున్న బాహుబలి నటుడు
X
మన ఫేవరేట్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే టికెట్కు దొరికేదాకా నిద్రపొం. ఫస్ట్ డే - ఫస్ట్ షో సినిమా చూస్తూ, హీరో ఎంట్రీ ఇవ్వగానే అరవడం - పేపర్లు విసరడం లాంటివి చేయనిదే మనకి సినిమా చూసిన ఫీలింగ్ ఉండదు. కాని జపాన్ లో ఈ పప్పులేం ఉడకవ్. ఎందుకంటే సినిమా స్క్రీనింగ్ షో అప్పుడు అరవడం లేదా గోల చేయడం థియేటర్ లలో నిషిద్ధం. కానీ బాహుబలి సినిమాకి ఆ రూల్ తీసేయనున్నారు.

మన జక్కన్న రాజమౌళి కి ఇండియాలోనే కాక జపాన్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. బాహుబలి సినిమా ఈవెంట్ కోసం వెళ్లిన రాజమౌళికి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు బాహుబలి సినిమా స్క్రీనింగ్ జరగబోతోంది. జపాన్ వాళ్ళు ఆ సినిమా లో నటించిన ఎవరో ఒకరిని పంపమని విన్నవించుకున్నారు. మాములుగా అయితే ప్రభాస్ - రానా - అనుష్క లేదంటే రమ్యకృష్ణ వెళ్ళాలి. కానీ జపాన్ వారు ప్రత్యేకంగా సుబ్బరాజును కోరారట. మిగతా అందరూ సూపర్ హీరోలు లాగా ఉన్నారని - కేవలం కుమారవర్మ పాత్ర పోషించిన సుబ్బరాజు మాత్రమే కొంచెం మనిషిలాగా ఉండడంతో బాగా కనెక్ట్ అయిపోయారట.

ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన మన సుబ్బా రాజు వీసా కోసం ఇవాళే ఇంటర్వ్యూకి వెళ్లారు. వీసా రాగానే టోక్యో లో బాహుబలి స్క్రీమింగ్ స్క్రీనింగ్ షోకి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. కేవలం భారత దేశంలోనే కాక జపాన్ - చైనా లాంటి చాలా దేశాల్లో కుడా బాహుబలి పేరు ఇప్పటికి నానుతూనే ఉంది. మరి మన రాజమౌళా మజాకా!!