Begin typing your search above and press return to search.
ఆర్ ఆర్ ఆర్ లో లేటెస్ట్ సెన్సేషన్!?
By: Tupaki Desk | 26 Dec 2018 6:31 AM GMTరాజమౌళి మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ గురించి వార్తల వేగం మళ్ళి పెరుగుతోంది. ప్రస్తుతం షూటింగ్ హోల్డ్ లో ఉన్నా ఇప్పటిదాకా వచ్చిన అప్ డేట్స్ అభిమానులకు కొత్త ఆసక్తిని రేపుతూనే ఉన్నాయి. జక్కన్న ఏది అధికారికంగా ప్రకటించడం లేదు కానీ గుట్టుగా ఆర్టిస్టుల సెలక్షన్ తో పాటు మిగిలిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. తాజా అప్ డేట్ ప్రకారం ఇందులో కన్నడ హీరో యష్ నెగటివ్ షేడ్స్ ఉండే పాత్ర చేయొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది.
యష్ కు కెజిఎఫ్ పుణ్యమా అని ఇక్కడ మంచి గుర్తింపు దక్కింది. గొప్ప టాక్ రాకపోయినా ఉన్నంతలో మాస్ ఆడియన్స్ కు నచ్చేలా కొంతవరకు ఉండటంతో పాస్ అనిపించుకునేలా వసూళ్లు దక్కించుకుంది. కన్నడ హీరోలు తెలుగులో విలన్ గానో సపోర్టింగ్ రోల్స్ లో చేయడం కొత్తేమి కాదు. అప్పట్లో ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే టైగర్ ప్రభాకర్ తెలుగులో చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించేవాడు. దేవ రాజ్ సైతం వచ్చిన మంచి ఆఫర్ దేన్నీ వదులుకునే వాడు కాదు.
భారీ ఫాలోయింగ్ ఉండే సుదీప్ రాజమౌళి అడగ్గానే ఈగలో విలన్ గా నటించాడు. వీళ్ళందరూ సక్సెస్ అయినవాళ్లే. అందుకే యష్ కూడా ఎక్కువ ఆలోచించకుండా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. యష్ కనక ఒప్పుకుంటే కన్నడలో ఆర్ ఆర్ ఆర్ రేంజ్ ఇంకా పెరుగుతుంది. బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుంది. మరి రాజమౌళి అన్ని కోణాల్లో ఆలోచించే ఏదైనా నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి ఇది నిజమైనా ఆశ్చర్యం లేదు