Begin typing your search above and press return to search.
బాహుబలికి బేస్.. నాని సినిమాయే
By: Tupaki Desk | 24 Jun 2015 7:30 PM GMTఇంటా బైటా బాహుబలికి బోలెడంత ప్రచారం సాగుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఏకకాలంలో రిలీజ్ (జూలై 10)కి ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగులో చేస్తున్న ప్రచారం వేరు. పొరుగు భాషల్లో చేస్తున్న ప్రచారం వేరే. ఇక్కడ ఎస్.ఎస్.రాజమౌళి సినిమా, ప్రభాస్, రానా నటించిన సినిమా అని ప్రచారం చేస్తుంటే.. పొరుగున మాత్రం వేరొక ట్యాగ్‌లైన్‌ని విస్త్రతంగా ఉపయోగిస్తున్నారు.
ఇది 'మఖ్ఖీ' డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా అని హిందీలో ప్రచారం చేస్తున్నారు. అలాగే తమిళంలోనూ నాన్-ఇ డైరక్టర్ సినిమా అంటూ ప్రచారానికి తెర తీశారు. ఇవాళే అక్కడ ఆడియో రిలీజ్ అయ్యిందిలే. ఎక్కడ చూసినా ఈగ డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా అన్న పాయింటును హైలైట్ చేశారు. అంతేకాదు అలా ప్రచారం చేసేప్పుడు విజువల్స్‌లో నానిని, నాని ఈగగా మారడాన్ని కూడా చూపిస్తున్నారు. దీనివల్ల నానికి కూడా ప్రచారం కలిసొస్తోంది. కారణం ఏదైనా బాహుబలికి బేస్ నాని సినిమా అన్న అర్థం జనాల్లోకి సూటిగా వెళ్లిపోయింది.
'ఈగ' చిత్రంలో విజువల్ గ్రాఫిక్స్ అద్భుతం. ఓ కీటకాన్ని అంత అద్భుతంగా చూపించగలిగిన సాంకేతిక నిపుణుడిగా రాజమౌళి వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. అందుకే ఆ పాయింట్‌ని విరివిగా ఉపయోగించుకున్నారు. బాహుబలి భారీ విఎఫ్‌ఎక్స్ ఉన్న సినిమా కాబట్టి .. సాంకేతికతను జక్కన్న అత్యంత సమర్ధంగా వినియోగించుకుని ఉంటాడులే అన్న ధీమా జనాల్లో ముందే కలిగించేందుకు ఇలాంటి ప్రయత్నం చేశారన్నమాట!