Begin typing your search above and press return to search.
రెహమాన్ తో సూటవ్వదంటున్నరాజమౌళి
By: Tupaki Desk | 22 Dec 2015 11:30 AM GMTరాజమౌళి-కీరవాణి బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు దశాబ్దంన్నరగా తన ప్రతి సినిమాకూ అన్నయ్యతోనే సంగీతం చేయించుకుంటుున్నాడు జక్కన్న. ఐతే వచ్చే ఏడాది ఆఖర్లో తాను రిటైరైపోతానని కీరవాణి ప్రకటించిన నేపథ్యంలో బాహుబలి-2 తర్వాత రాజమౌళి చేసే సినిమాలకు ఎవరు సంగీతం అందిస్తారో అన్న ప్రశ్న ఇప్పటికే జనాల్లో మొదలైంది. ఈ విషయంలో చాలామంది అభిప్రాయం.. రెహమాన్ అయితే బాగుంటుందని. గత కొన్నేళ్లలో రాజమౌళి స్థాయి ఎంతో పెరిగిన నేపథ్యంలో రెహమాన్ తప్ప ఇంకెవరూ అతడి సినిమాలకు న్యాయం చేయలేరన్నది జనాల ఫీలింగ్.
మరి ఈ విషయంలో రాజమౌళి అభిప్రాయమేంటి? భవిష్యత్తులో రెహమాన్ తో కలిసి పని చేస్తాడా? ఈ ప్రశ్నే ఆయన్ని అడిగితే చిత్రమైన సమాధానం ఇచ్చాడు జక్కన్న. ‘‘రెహమాన్ తో పని చేస్తానో లేదో తెలియదు. మేమిద్దరం కలిస్తే అద్భుతమైన ఔట్ పుట్ రావచ్చు. అదే సమయంలో ఇద్దరం పోట్లాడుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి క్రియేటర్ కూ ఒక సెపరేట్ వర్కింగ్ స్టైల్ ఉంటుంది. నేను విన్నదాని ప్రకారం రెహమాన్ గారు చీకటి పడ్డాకే పని మొదలుపెడతారట. సరిగ్గా అదే సమయానికి నా బుర్ర పని చేయడం మానేస్తుంది. నేను ఉదయం 4-4.30 మధ్య నిద్ర లేచి సాయంత్రం 7-8 వరకు పని చేస్తా. కానీ ఆ సమయంలో రెహమాన్ నిద్ర పోతారు. మరి మేమిద్దరం కలిసి ఎలా పని చేయగలమో నాకు తెలియదు’’ అని సెలవిచ్చాడు రాజమౌళి. దీన్ని బట్టి రెహమాన్ తో తనకు సూటవ్వదని జక్కన్న చెప్పకనే చెప్పేస్తున్నట్లేనా?