Begin typing your search above and press return to search.
రాజమౌళి.. నాన్నకు ప్రేమతో!
By: Tupaki Desk | 25 May 2017 1:36 PM GMTవిజయేంద్ర ప్రసాద్ వల్ల రాజమౌళి అంత సక్సెస్ అయ్యాడా.. లేక రాజమౌళి వల్ల రచయితగా విజయేంద్ర ప్రసాద్ అంత గొప్ప పేరు సంపాదించాడా అని అడిగితే సమాధానం చెప్పడం కష్టం. వీళ్లిద్దరి విజయాల్లోనూ పరస్పర సహకారం ఉంది. ఒకరికొకరు సహకరించుకుంటూ.. ఒకరి విజయంలో ఇంకొకరు పాలుపంచుకుంటూ సాగిపోతున్నారు ఈ తండ్రీ కొడుకులు. ఐతే రాజమౌళి లేకుండా సొంతంగా తనేంటో రుజువు చేసుకోవడానికి విజయేంద్ర ప్రసాద్ చేసిన కొన్ని ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన స్వయంగా మెగా ఫోన్ పట్టి చేసిన సినిమాలు (శ్రీకృష్ణ 2006, రాజన్న) అనుకున్న ఫలితాన్నివ్వలేదు. ఇప్పుడు ఆయన ఆశలన్నీ ‘శ్రీ వల్లీ’ మీదే ఉన్నాయి. కానీ ఈ చిత్రానికి అనుకున్నంత హైప్ రాలేదు.
‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదల తర్వాత అయినా ‘శ్రీవల్లీ’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందేమో అని చూశారు కానీ అలాంటిదేమీ ఉన్నట్లుగా లేదు. దీంతో తన కొడుకు సహకారంతో ఈ సినిమాను పైకి లేపాలని చూస్తున్నట్లున్నాడు విజయేంద్ర ప్రసాద్. ‘శ్రీవల్లీ’కి రాజమౌళితో వాయిస్ ఓవర్ ఇప్పిస్తున్నాడట విజయేంద్ర. జక్కన్న వాయిస్ తో ఒక స్పెషల్ ట్రైలర్ కూడా విడుదల చేస్తారట. ఆ తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తారట. సినిమా ఆరంభంలోనే కాక.. కొన్ని కీలక సన్నివేశాల్లోనూ రాజమౌళి వాయిస్ వినిపిస్తుందట. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన ‘శ్రీవల్లీ’లో అందరూ కొత్త వాళ్లే నటించారు. మనసును నియంత్రించి.. చెడు ఆలోచనలపై విజయం సాధించే ఓ ప్రయోగం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/