Begin typing your search above and press return to search.
పోలీస్ పర్మీషన్ కోసం జక్కన్న వెయిటింగ్
By: Tupaki Desk | 17 Jun 2020 7:50 AM GMTరాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం టెస్ట్ షూట్ ను రెండు రోజుల పాటు నిర్వహించేందుకు రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ చరణ్ ల స్థానంలో డూప్ లను ఉపయోగించి ప్రభుత్వ గైడ్ లైన్స్ ను ఫాలో అవుతూ షూటింగ్ చేయాలని జక్కన్న భావించాడు. అందుకు రెడీ అయ్యి పోలీసుల నుండి అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం బిజీ గా ఉంటున్నారు. డిపార్ట్ మెంట్ కు చెందిన వారు కూడా చాలా మంది పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు.
పోలీసులు ఆ హడావుడిలో ఉన్న కారణంగా ఆర్‌ఆర్‌ఆర్ టెస్టు షూట్ కోసం జక్కన్న చేసుకున్న విజ్ఞప్తిని ఇంకా పరిశీలించలేదు. ఒకటి రెండు రోజుల్లో జక్కన్న టీం కు పోలీసు ఉన్నతాధికారుల నుండి అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందని అంతా ఆశిస్తున్నారు. రెండు రోజుల షూటింగ్ సాఫీగా సాగితే అంతా అనుకున్నట్లుగా జరిగితే అప్పుడు హీరోలతో రెగ్యులర్ షూట్ కు జక్కన్న వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
సీరియల్స్ మరియు చిన్న చిత్రాలు వెబ్ సిరీస్ లకు పెద్దగా అనుమతులు అక్కర్లేదు. కాని పెద్ద సినిమాలు మాత్రం ఖచ్చితంగా అనుమతులు తీసుకోవడంతో పాటు పూర్తి వివరాలు ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా గైడ్ లైన్స్ లో పేర్కొనడం జరిగింది.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంను సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనుకున్న సమయంలో సినిమా రాదని తేలిపోయింది. జక్కన్న ఇప్పుడు చిత్రీకరణ చేసినా కూడా సినిమా విడుదలకు సంక్రాంతి సరైన సమయం కాదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు అన్ని కూడా కుదుట పడ్డ తర్వాతే ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. అంటే వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు వెయిట్ చేయవచ్చు.