Begin typing your search above and press return to search.
ఆయనింకా బాహుబలి చూడలేదటగా..
By: Tupaki Desk | 1 July 2015 1:45 PM GMTనిర్మాత అన్నాక తన సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు రషెస్ చూసుకుని.. ఏవైనా మార్పులుంటే చెబుతుండాలి. అందులోనూ ఆ నిర్మాత వంద సినిమాలు తీసిన దర్శకుడైతే తన సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాడు. కానీ రాఘవేంద్రరావుకు మాత్రం అలాంటి టెన్షన్లేమీ లేనట్లున్నాయి. తన శిష్యుడు రాజమౌళి మీద ఉన్న అపారమైన నమ్మకం వల్ల కావచ్చు. ఇప్పటిదాకా ఆయన 'బాహుబలి'లో ఒక్క సీన్ కూడా చూడలేదట. ఈ సినిమాలో రాఘవేంద్రరావుకు కూడా భాగస్వామ్యం ఉందన్న సంగతి తెలిసిందే. దీనికి సమర్పకుడు కూడా ఆయనే.
దర్శకేంద్రుడు కొంచెం పెట్టుబడి అయితే పెట్టాడు కానీ.. నిర్మాణ వ్యవహారాలన్నీ శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలే చూసుకున్నారు. కేఆర్ ఏ రోజూ షూటింగ్‌కు కూడా రాలేదట. సినిమా విశేషాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు కానీ.. ఇప్పటిదాకా సినిమాను చూడలేదట. ఇది తనకు చాలా టెన్షన్ పుట్టిస్తోందని అంటున్నాడు రాజమౌళి. ''సినిమా విడుదల సమయం దగ్గరపడేకొద్దీ నాకు టెన్షన్ పెరిగిపోతోంది. దాన్ని కవర్ చేసుకోలేక చస్తున్నా. దీనికి తోడు మా గురువుగారు రాఘవేంద్రరావు ఇప్పటిదాకా సినిమా చూడలేదు. ఆయన చూసి ఏమంటారో అన్న టెన్షన్ కూడా నన్ను నిలవనీయడం లేదు. ఆయన త్వరగా సినిమా చూసి తన అభిప్రాయం చెప్పాలని ఎదురు చూస్తున్నా'' అన్నాడు రాజమౌళి. ఎలాగూ రిలీజ్‌కు ముందు సినీ సెలబ్రెటీస్ కోసం షో వేయబోతున్నారు. రాఘవేంద్రుడు అప్పుడు చూసి తన అభిప్రాయం చెబుతారేమో.