Begin typing your search above and press return to search.
మహేష్ కోసం ప్రాజెక్ట్ వదులుకున్న జక్కన్న
By: Tupaki Desk | 30 Oct 2021 2:30 PM GMTప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ `ఆర్.ఆర్.ఆర్` పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి 2022 కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ రెండు నెలల్లోనే మొత్తం అన్ని పనులు పూర్తిచేసి రిలీజ్ కి రెడీ చేయాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన వెంటనే ప్రచారం పనుల్లో నిమగ్నమవ్వాలి. తొలిసారి పాన్ ఇండియా కంటెట్ తో ఇద్దరు బిగ్ స్టార్లను పాన్ ఇండియా రేంజులో పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జక్కన్న పై ఎంతో బాధ్యత ఉంది. ఆ ఇద్దరు స్టార్లను పాన్ ఇండియా హీరోలుగా నిలబెట్టాకే ఆయన బయటకు రావాలి. అప్పుడే జక్కన్న ప్రశాంతగా నిద్రపోగలిగేది.
ఆ సంగతిని పక్కనబెడితే `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ అయిన వెంటనే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ చిత్రం పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అయితే ఈ గ్యాప్ లో జక్కన్న తన ఫ్యామిలీ నటుడు అయిన శ్రీసింహాతో తక్కువ బడ్జెట్ లో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు. జక్కన్న బ్రాండ్ తో సింహాని వదిలితే మార్కెట్ ఈజీగా ఉంటుందని ఇలా ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు ఆప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే ఆలోనలో రాజమౌళి లేనట్లు సమాచారం. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్.. అటుపై మహేష్ ని డైరెక్ట్ చేయడంపైనే దృష్టి సారించారు. ఇంతలోనే చిన్న సినిమా అంటే కష్టమని భావించి ఆ ప్రాజెక్ట్ ని పెండింగ్ లో పెట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇదే ప్రాజెక్ట్ కి మరో దర్శకుడిని లాక్ చేసే ఆలోచనలోన జక్కన్న ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. జై సింహాకి తగ్గ సరైన స్క్రిప్ట్ ఎంపిక చేసి..దానికి అన్ని హంగులు అద్ది ..ఓ మంచి మేకర్ ని రంగంలోకి దించితే సరిపోదా? అన్న థాట్ వచ్చిందని తెలుస్తోంది. సరైన కంటెంట్ ఉన్న బౌండ్ స్క్రిప్ట్ ఉంటే బ్రాండ్ ఇమేజ్ తో పనేం ఉంటుంది? పైపెచ్చు సక్సెస్ సాధిస్తే అది సిసలైన విజయంగాను నిలస్తుంది. హీరోకి పేరు దక్కుతుంది..! అన్న ఆలోచన మొదలైనట్లు ప్రచారం సాగుతోంది.
మహేష్ తో ఎలాంటి కథతో..?
సూపర్‌స్టార్ మహేష్ సర్కార్ వారి పాటను సంక్రాంతి 2022 బరిలో రిలీజ్ చేస్తున్నారు. అటుపై త్రివిక్రమ్ తో సినిమా చేస్తారు. ఆ తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళితో పని చేస్తాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రారంభిస్తారు. మహేష్ బాబు ఇటీవల ఈ ప్రాజెక్టును కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ -``రాజమౌళి తో పాన్-ఇండియా అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నానని.. హిందీలో అరంగేట్రం చేయడానికి ఇదే సరైన సినిమా ``అని తెలిపారు. ఈ చిత్రం బహు భాషల్లో రూపొందుతుంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మిస్తారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన పాన్ ఇండియన్ చిత్రం RRR విడుదలైన వెంటనే రాజమౌళి మహేష్ బాబు సినిమాపైనే పూర్తిగా దృష్టి పెడతారు. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే స్క్రిప్టుపై పని చేస్తున్నారు. మహేష్ - దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా చిత్రం కథాంశాన్ని యూనిక్ గా ఉండేలా విజయేంద్ర ప్రసాద్ తీర్చిదిద్దుతున్నారని కథనాలొస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై రాజమౌళి కి విజయేంద్రులకు ఇప్పటికి క్లారిటీ వచ్చింది. అధికారిక ప్రకటన వెలువడేందుకు సమయమాసన్నమైందని అర్థమవుతోంది.