Begin typing your search above and press return to search.
భార్య సంపాదనపై బతికానన్న రాజమౌళి
By: Tupaki Desk | 3 Nov 2021 12:30 PM GMTప్రతి భర్త సక్సెస్ వెనుక భార్య ఉంటుందని అంటారు. సుఖాలే కాదు.. కష్టాల్ని పంచుకోవడం భార్య బాధ్యత. కానీ ఇది అందరికీ వర్తించదు. కొందరికి మాత్రమే ఇది పాజిబుల్. కష్టాల్లో ఉన్న భర్తను ఆదుకున్న భార్యలకు మాత్రమే జక్కన్న వాఖ్యలు అంకింతం. భర్త కష్టాల్లో పాలు పంచుకున్న భార్యల్ని ఎంతో మందిని చూస్తుంటాం. భర్తల్ని ఇబ్బంది పెట్టిన భార్యల్ని చూస్తుంటాం. భార్యభర్తల మధ్య డబ్బు మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తుందని అనే పాయింట్ ని హైలైట్ చేస్తూ కొందరు దర్శకనిర్మాతలు సినిమాలు చేసారు. సక్సెస్ అనేది ఊహించుకున్నంత వీజీ కాదు. రాత్రికి రాత్రే అది దక్కదు. చాలా టైమ్ పడుతుంది. ఓపిక నిగ్రహం ఓర్పు ఇవన్నీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా భార్యకు చాలా అవసరం.
కొందరికి ఈజీగా సక్సెస్ దక్కినా చాలామందికి దశాబ్ధాలు పడుతుంది. అంతవరకూ వెయిట్ చేయడమే భార్య గొప్పదనం అని దర్శకధీరుడు రాజమౌళి తన మాటల్లో చెప్పకనే చెప్పే ప్రయత్నం చేసారు. ఆ రకంగా జక్కన్న సతీమణి రమా రాజమౌళి ఎంతో ఓర్పు నేర్పు సహానంతో తనకు అన్ని రకాలుగా సహకారం అందించారని రాజమౌళి తెలిపారు. తన కెరీర్ తొలి అడుగుల్లో భార్య సహకారం వల్లనే తాను ఈ స్థాయికి ఎదిగానని వెల్లడించారు. శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రి లో నిర్వహించిన ఓ ఈవెంట్ లో ఆయన ఈ మాటలు అన్నారు. నేడు రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారంటే ఆయన సక్సెస్ వెనుక రమారాజమౌళి పాత్ర ఎంతో ఉందని అన్నారు. చిన్ననాటి నుంచి జక్కన్నకు చదువు సరిగ్గా అబ్బేది కాదట. సినిమాలు తప్ప మరో ప్రప్రంచం తెలియకుండా పెరిగేవాడినని అన్నారు.
తండ్రి విజయేంద్ర ప్రసాద్ అప్పటికే పరిశ్రమలో ఉండటంతో ఆయన ద్వారా 24 శాఖలపై పట్టు సంపాదించానని.. సక్సెస్ అవ్వాలన్న కసితో పనిచేసేవాడినని అన్నారు. ఒకానొక సమయంలో భార్య సంపాదనపై ఆధారపడేవాడినని తెలిపారు. ఇంటికి పెద్ద దిక్కై ఆమె నడిపించేదన్నారు. ఆమెకు అంత గొప్ప లక్షణం తన తల్లిదండ్రుల నుంచి వచ్చిందని... ఆమెను కొన్ని విలువలతో పెంచారు. తల్లి..తండ్రి అంటే ఆమెకు అపారమైన గౌరవం అని.. అత్తమామల్ని తల్లితండ్రిగా భావించి సమానులుగా చూసేదని అన్నారు. అందుకే ఇప్పుడు గర్వంగా చెబుతున్నా. భార్య సంపాదని మీద ఆధారపడినవాడిగా ఎలాంటి సిగ్గు..మెహమాటం లేకుండా చెబుతున్నా. ఉదయాన్నే తనని ఆఫీస్ కి దించేవాడిని. మళ్లీ సాయంత్రం 5 గంటలకు పికప్ చేసుకోవడానికి వెళ్లేవాడిని. మధ్యలో కథలు..డైలాగులు రాసుకోవడం మాత్రమే తన పని అని రాజమౌళి నర్మగర్భంగా భార్య గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు. విజేతగా నిలిచేవారి వెనుక ఎవరో ఒకరు ఎలా ఉంటారో? అతన్ని వెనక్కి పట్టుకుని లాగడం వెనుక అలాంటి వారు ఉంటారనేది కొందరి అనుభవంలో బయటపడుతుంది. కానీ ఈ విషయంలో జక్కన్న ఎంతో అదృష్టవంతుడు అంటూ నెటిజనులు చాలా మంది నిజాల్ని అంగీకరిస్తున్నారు.