Begin typing your search above and press return to search.
అమరావతిలో రాజమౌళి.. జస్ట్ రూమరే?
By: Tupaki Desk | 28 Dec 2016 3:30 AM GMTనవ్యాంధ్రప్రదేశ్ కి కొత్త రాజధాని అమరావతిని అద్భుతంగా రూపకల్పన చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. 900 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన ఈ రాజధాని నిర్మాణ కోసం ఇప్పటికే అంతర్జాతీయంగా పలువురు ఆర్కిటెక్ట్స్ తో డిజైన్స్ సిద్ధం చేస్తున్నారు.
వీరు ఇప్పటికే కొన్ని డిజైన్లను చూపగా చంద్రబాబుకు అవేవీ నచ్చలేదట. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. విచిత్రమైన విషయం ఏంటంటే.. బాహుబలి మూవీలో మాహిష్మతి రాజ్యాన్ని దర్శకధీరుడు రాజమౌళి చూపించిన విధానం ఆయన మనోఫలకంపై స్థిరపడిపోయిందట. అందుకే అమరావతి డిజైనింగ్ కు సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్కిటెక్టుల బృందంలో రాజమౌళిని సలహాదారుడిగా తీసుకున్నారని.. ఇప్పటికే ఒకటి రెండు భేటీలు కూడా జరిగాయనే టాక్ వినిపిస్తోంది.
దీనిపై రాజమౌళి తండ్రి.. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. ఇవన్నీ రూమర్లే అని కొట్టి పారేసిన ఆయన.. ఇది అసాధ్యమైన విషయం అన్నారు. మాహిష్మతి రాజ్యాన్ని తిరిగి నిర్మించాలని భావించినా.. ఆ చిత్రానికి పని చేసిన ఆర్ట్ డైరెక్టర్ ను సంప్రదిస్తారు తప్ప.. సినిమా దర్శకుడిని కాదని తేల్చేశారు విజయేంద్ర ప్రసాద్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/