Begin typing your search above and press return to search.

బాషా వస్తున్నాడు.. సీక్వెల్ కాదులే

By:  Tupaki Desk   |   24 Aug 2016 4:19 AM GMT
బాషా వస్తున్నాడు.. సీక్వెల్ కాదులే
X
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల్లో బాషాకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఒకే ఒక్క సినిమా ఈ తమిళ్ స్టార్ ని.. తెలుగులో టాప్ హీరో రేంజ్ చేసేసింది. రీసెంట్ గా రిలీజ్ అయిన కబాలికి కూడా మరో బాషా రేంజ్ సినిమా అనిపించేలా ప్రచారం జరగడంతోనే.. అంతటి హైప్ వచ్చింది. అలాంటి బాషాకు సీక్వెల్ తీసేందుకు దర్శకుడు ప్రయత్నాలు బాగానే జరుగుతున్నాయి.

సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన బాషా పెను సంచలనం. ఇప్పుడా సినిమాని మరోసారి థియేటర్లలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సారి డిజిటల్ వెర్షన్ ను రిలీజ్ చేయాలన్నది నిర్మాత ఆలోచన. కబాలితో రజినీ స్టామినా మరోసారి ప్రూవ్ అయింది. బాగోలేదన్న మౌత్ టాక్.. వరస్ట్ అంటూ రివ్యూలు వచ్చినా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. అందుకే ఇప్పుడా క్రేజ్ ని ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. రజినీకాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12న బాషా డిజిటల్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పనులను దర్శకుడు కేఎస్ రవికుమార్ దగ్గరుండి చూసుకుంటున్నారట.

ప్రస్తుతం కొంత బ్రేక్ తీసుకుంటున్న సూపర్ స్టార్.. త్వరలో రోబో సీక్వెల్ 2.0 షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని దర్శకుడు శంకర్ భావిస్తున్నాడు.