Begin typing your search above and press return to search.

'2.ఓ’': కళ్లజోడుతో బడ్జెట్‌ తగ్గించారట!

By:  Tupaki Desk   |   28 Nov 2018 11:06 AM GMT
2.ఓ’: కళ్లజోడుతో బడ్జెట్‌ తగ్గించారట!
X
ఎన్నో నెలలుగా తమిళ, తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా బాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న ‘2.ఓ’ చిత్రం విడుదలకు అంతా సిద్దం అయ్యింది. మరికొన్ని గంటల్లో 2.ఓ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా స్క్రీన్స్‌ పై సందడి చేసేందుకు రెడీగా ఉంది. 2.ఓ చిత్రం నేడు రాత్రికే కొన్ని దేశాల్లో ప్రీమియర్‌ లు పడబోతున్నాయి. తెల్లారిన తర్వాత అంటే రేపు ఈ చిత్రం ఇండియాలో విడుదల కాబోతుంది. దాదాపు 600 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ పాత్ర చాలా ప్రాముఖ్యమైనదిగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. బడ్జెట్‌ లో అధిక భాగం విజువల్‌ ఎఫెక్స్‌ కు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌ వైజర్‌ గా చేసిన శ్రీనివాస మోహన్‌ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశాడు. కొన్ని వేల మంది ఈ చిత్రం కోసం వర్క్‌ చేశారని, వారందరి కష్టం ఫలితమే ఈ చిత్రం అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రంలో రోబోకు కళ్లద్దాలు పెట్టడంపై శ్రీనివాస మోహన్‌ స్పందిస్తూ.. రోబో కళ్లను యానిమేషన్‌ చేయడం అంటే చాలా రిస్క్‌ తో కూడిన పని, ఇక కను బొమ్మలను డిజైన్‌ చేయడం, వాటిని యానిమేషన్‌ చేయడం కూడా చాలా కష్టమైన పని. అందుకే ఆ రెంటిని కవర్‌ చేసేందుకు రోబోకు కళ్లద్దాలు పెట్టామని చెప్పాడు.

కళ్లద్దాలు పెట్టడం వల్ల భారీగా బడ్జెట్‌ సేవ్‌ అయ్యింది. ఒకవేళ కళ్లు - కనుబొమ్మలను కూడా చూపిస్తే బడ్టెట్‌ ఇంకా పెరిగేదని చెప్పుకొచ్చాడు. ‘రోబో’ చిత్రంకు అప్పట్లో బడ్జెట్‌ పరిమితులు ఉండటం వల్ల అలా చేయాల్సి వచ్చిందని, అదే ఇప్పుడు కంటిన్యూ చేసినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. 2.ఓ చిత్రం విజువల్‌ ఎఫెక్ట్స్‌ హాలీవుడ్‌ సినిమా స్థాయిలో ఉంటాయని పేర్కొన్నాడు.