Begin typing your search above and press return to search.
మంచి ఉద్యోగం వదులుకుని ఈ సినిమా చేశాను: 'రాజరాజ చోర' దర్శకుడు
By: Tupaki Desk | 16 Aug 2021 2:47 AM GMTశ్రీవిష్ణు హీరోగా .. వినోదమే ప్రధానంగా దర్శకుడు హసిత్ గోలి 'రాజ రాజ చోర' సినిమాను రూపొందించాడు. అభిషేక్ అగర్వాల్ .. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి జరిగింది. ఈ వేదికపై దర్శకుడు హసిత్ గోలి ఈ సినిమాను గురించి మాట్లాడాడు. "నేను ఉద్యోగం మానేసి సినిమాల వైపుకు వచ్చాను. అయినా నాపై నమ్మకంతో మా అమ్మానాన్నలు అంగీకరించారు. అందుకు ముందుగా వాళ్లిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
శ్రీవిష్ణుతో ఈ సినిమాను చేస్తానని నేను అనుకోవడానికి ముందు నుంచే నేను ఆయన అభిమానిని. ఆయనలో కొంత కొంటెదనం ఉంది .. ఆ కొంటెదనాన్ని పదింతలు చూపించే సినిమా ఇది. ఈ కథను ప్రేక్షకులకు అందించాలని నేను వచ్చాను. అందుకు నిర్మాతలు నాకు ఎంతో సహకరించారు. అలాగే శ్రీవిష్ణు - సంగీత దర్శకుడు వివేక్ సాగర్ .. కెమెరా మేన్ వేద రామన్ అంతా కూడా నాకు ఎంతో సపోర్టుగా నిలిచారు. నేను చేసినదల్లా అన్నీ సమానంగా ఉన్నాయా? లేవా? అని మాత్రమే. ఎవరి వర్క్ ను వారు పెర్ఫెక్ట్ గా చేయడం వల్లనే ఈ రోజున అంతా ఇక్కడ ఉన్నాం.
ఇక నటీనటుల విషయానికొస్తే అందరూ కూడా కథకు .. తమ పాత్రలకు లోబడి చేశారు. కథ సహజంగా ముందుకు వెళ్లడానికి తమవంతు కృషి చేశారు. వాళ్లంతా పడిన కష్టం తెరపై కచ్చితంగా కనిపిస్తుంది. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా విడుదలవుతుంది. అందువలన అంతా ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ థియేటర్లకు రండి. మీరు ఆశించిన ఎంటర్టైన్ మెంట్ ను ఈ సినిమా అందిస్తుందని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను" అంటూ ముగించాడు.
నారా రోహిత్ మాట్లాడుతూ .. " సినిమాను నేను చూశాను .. చాలా బాగా వచ్చింది. శ్రీవిష్ణు నాకు చాలా కాలంగా తెలుసు. తాను సీరియస్ గా ఉండే పాత్రలను చాలా బాగా చేస్తాడు. కామెడీ పాత్రలను అంతకన్నా బాగా చేస్తాడు. ఈ సినిమాలోని పాత్ర ఆయనకు కరెక్టుగా సెట్ అయింది. తప్పకుండా ఆయన హిట్ కొడతాడనే నమ్మకం నాకు కలిగింది. హసిత్ గోలికి తప్పకుండా మంచి పేరు తెస్తుంది" అన్నాడు. ఇక కథానాయికలైన మేఘ ఆకాశ్ ... సునైన మాట్లాడుతూ, శ్రీ విష్ణుతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందనీ, ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.