Begin typing your search above and press return to search.
ఒక్క ఫ్యామిలీలో మూడు విరాళాలు..పబ్లిసిటీ కోసమా?
By: Tupaki Desk | 5 April 2020 2:29 PM GMTకరోనా విపత్తు నేపథ్యంలో టాలీవుడ్ సినీ కార్మికుల కోసం పలువురు టాలీవుడ్ స్టార్స్ తమ సాయంను అందించేందుకు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) ఏర్పాటు చేసి సినీ కార్మికులకు సాయం చేస్తున్నారు. ఈ ఛారిటీ కోసం పలువురు నటీనటులు ఇంకా దర్శకులు పలువురు తమవంతు విరాళంను ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా రాజశేఖర్ ఫ్యామిలీ కూడా తమవంతు సాయంను ప్రకటించారు.
రాజశేఖర్ ఫ్యామిలీ ప్రకటించిన విరాళంపై సోషల్ మీడియాలో ఒక వర్గం వారు ట్రోల్స్ చేస్తున్నారు. శివాత్మిక.. శివాని వేరు వేరుగా లక్ష రూపాయల చొప్పున విరాళాలు ప్రకటించారు. ఇక జీవిత రాజశేఖర్ లు కలిసి సినీ కార్మికులకు కిరాణ సరుకులు ఇంకా ఆహార పదార్థాలను అందించారు. ఈ విషయాన్ని శివాని.. శివాత్మిక ఇంకా రాజశేఖర్ లు తాము విరాళం ఇచ్చినట్లుగా ట్విట్టర్ లో ప్రకటించారు.
వారి విరాళంను పలువురు అభినందిస్తున్నారు. ఇలాంటి సమయంలో మీ విరాళం సినీ కార్మికులకు ఎంతో ఉపయోగదాయకం అంటూ అభినందిస్తూ ఉంటే కొందరు మాత్రం ఒక్క ఫ్యామిలీ నుండి ముగ్గురు వేరు వేరుగా విరాళాలు ప్రకటించడం ఏంటీ పబ్లిసిటీ స్టంట్ కాకపోతే అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. వారి విమర్శలు ఏమో కాని సొంత డబ్బులను శివాని.. శివాత్మికలు విరాళంగా ప్రకటించడం నిజంగా అభినందనీయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.