Begin typing your search above and press return to search.
`ముద్దుల ప్రియుడి` బావగా `అల్లరి ప్రియుడు`?
By: Tupaki Desk | 26 Nov 2017 11:33 AM GMTబాలీవుడ్ - కోలీవుడ్ - మాలీవుడ్ లలో స్టార్ హీరోలు మల్టీ స్టారర్లు చేసే ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే, టాలీవుడ్ మాత్రం ఈ విషయంలో కొద్దిగా వెనుకబడే ఉందని చెప్పవచ్చు. అడపాదడపా ఎవరన్నా చిన్న హీరోలు మల్టీ స్టారర్లతో అలరించడం తప్ప స్టార్ హీరోలు డేర్ చేసిన దాఖలాలు లేవు. అయితే, విక్టరీ వెంకటేష్ - ప్రిన్స్ మహేష్ బాబు ఆ ట్రెండ్ కు బ్రేక్ వేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో వారిద్దరూ ఓ సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత టాలీవుడ్ లో ఆ ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా, మరోసారి వెంకీ ఓ మల్టీ స్టారర్ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. తేజ దర్శకత్వంలో వెంకీ నటించనున్న చిత్రంలో ఓ సీనియర్ హీరో నటించబోతున్నట్లు పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి.
`నేనే రాజు నేనే మంత్రి` సినిమా కోసం ముందుగా `యాంగ్రీ యంగ్ మ్యాన్` రాజశేఖర్ ను సంప్రదించానని తేజ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఆ చిత్ర క్లైమాక్స్ విషయంలో వారిద్దరికీ అభిప్రాయభేదాలు రావడంతో రాజశేఖర్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆ అవకాశాన్ని అందుకున్న రాణా - తేజలు హిట్ ను అందుకున్నారు. అదే ఊపులో వెంకీతో మరో సినిమా చేసేందుకు తేజ సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, ఆ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం మాధవన్ - నారా రోహిత్ - సుమంత్ ల పేర్లు వినిపించాయి. తాజాగా, ఆ చిత్రానికి కీలకమైన వెంకటేష్ బావ పాత్రలో నటించేందుకు రాజశేఖర్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే, `గరుడవేగ`తో మంచి హిట్ కొట్టి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజశేఖర్ ఇకపై నటించబోయే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెంకీ - తేజ ల ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? లేదా? అన్న విషయం తేలాల్సి ఉంది. ఒకవేళ రాజశేఖర్ అంగీకరిస్తే...వెండితెరపై తొలిసారిగా వెంకీ - రాజశేఖర్ ల కాంబో ఆసక్తికరంగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సారైనా తేజకు రాజశేఖర్ ఓకే చెబుతాడో? లేదో? వేచి చూడాలి.