Begin typing your search above and press return to search.

రూమర్లు విన్నాక విలన్ ని వెతికాడు

By:  Tupaki Desk   |   19 Feb 2016 1:30 AM GMT
రూమర్లు విన్నాక విలన్ ని వెతికాడు
X
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు సంపాదించి ఎన్నో సినిమాలు చేసిన హీరో రాజశేఖర్.. హిట్ కొట్టి చాలా సంవత్సరాలే అయింది. ఏడేళ్ల క్రితం సత్యమేవ జయతే తర్వాత కనీసం ఆ మాత్రం ఆడిన మూవీ మరొకటి లేదు. అయినా తెలుగు సినీరంగంపై వరుసగా దండయాత్రలు బాగానే చేశాడు కానీ.. ఏదీ వర్కవుట్ కాలేదు. అందుకే ఇప్పుడు విలన్ గా టర్న్ తీసుకుంటున్నాడనే వార్తలు చాలానే వచ్చాయి. కొందరు పెద్ద డైరెక్టర్లు కూడా విలన్ రోల్ కోసం రాజశేఖర్ ని అప్రోచ్ అయ్యారని వినిపించినా.. ఏదీ ఫైనల్ కాలేదు.

స్క్రీన్ పై యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తోపాటు.. అహంకారం ఉన్న మనిషి అని రాజశేఖర్ కి ఇండస్ట్రీలో బాగానే గుర్తింపు ఉంది. మరి ఇలాంటి వ్యక్తికి.. తేజ లాంటి డైరెక్టర్ అయితే కరెక్ట్ గా సరిపోతాడని.. రోల్ కూడా బాగా పండుతుందనే ఓ రూమర్ ఎవరో పుట్టించారు. ఆ తర్వాత రాజశేఖర్-తేజలు ఓ మూవీ కోసం జట్టు కట్టారనే న్యూస్ కూడా స్ప్రెడ్ అయిపోయినా.. అప్పటికైతే అందులో నిజం లేదు.

ఈ రూమర్స్ అన్నీ విన్నాక.. తేజకు అదే కరెక్ట్ అయిడియా అనిపించిందట. అందుకే తను తీయబోయే కొత్త సినిమా 'అహం' అనే మూవీలో నెగిటివ్ రోల్ చేయాల్సిందిగా రాజశేఖర్ ని అడగడం, ఆయన ఒప్పేసుకోవడం.. ప్రాజెక్టు పట్టాలెక్కడం జరిగిపోయాయి. అలా ఓ రూమర్ కారణంగా.. తేజకు విలన్ దొరికాడు. రాజశేఖర్ కు కొత్త పాత్రలోకి మారే అవకాశం వచ్చింది. అఫ్ కోర్స్.. ఈ సీనియర్ హీరోకి విలన్ రోల్స్ కొత్తేం కాదు కదా. అసలు రాజశేఖర్ కి గుర్తింపు వచ్చిందే విలన్ రోల్స్ తో. ఇప్పుడు మరోసారి వాటితో సత్తా చాటేందుకు రెడీ అయిపోతున్నాడు.