Begin typing your search above and press return to search.
యాంగ్రీ హీరో విరాళం..'మా' సభ్యుల్లో హర్షం!
By: Tupaki Desk | 14 Sep 2019 4:20 PM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం లుకలుకల గురించి తెలిసిందే. అధ్యక్ష-కార్యవర్గం మధ్య విభేధాలు తొలి నుంచి బయటపడుతూనే ఉన్నాయి. అయితే ప్రతిసారీ సమస్యను అంతర్గతంగా పరిష్కరించుకుంటామని మా అసోసియేషన్ కీలక కార్యవర్గం చెబుతోంది. మొన్నటికి మొన్న అధ్యక్షుడితో ఇతర కార్యవర్గం విభేధిస్తోందని అందువల్ల కీలక భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రచారమైంది. మూవీ ఆర్టిస్టుల సంఘం విభేధాల వల్ల నిధి సేకరణ కార్యక్రమాలు జరగడం లేదని.. సొంత బిల్డింగ్ నిర్మాణం ఆలస్యమవుతోందని ఆర్టిస్టుల్లో చర్చ సాగింది.
అయితే అధ్యక్షుడితో విభేధాలు లేవంటూ ఆ తర్వాత మా అసోసియేషన్ ఓ అధికారిక ప్రకటనలోనూ వెల్లడించింది. తదుపరి కార్యాచరణ పైనా.. మా భవంతి నిర్మాణం కోసం నిధి సేకరణపైనా దృష్టి సారిస్తామని ప్రకటించారు. తాజాగా ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు రాజశేఖర్ ఈ విషయమై ఇనిషియేషన్ తీసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే మూలధనం నుంచి కరగదీయాల్సిన సన్నివేశం నెలకొంది. సంక్షేమ కార్యక్రమాలు లేక ఆదాయానికి గండి పడింది. దీంతో ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ `మా`సంక్షేమ కార్యక్రమాల కోసం 10లక్షల విరాళం ప్రకటించారు. పెద్ద మనసుతో అతడు చేస్తున్న సాయంపై ఆర్టిస్టులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపై నిధి సేకరణ కోసం చిత్రపరిశ్రమ సాయంతో పలు కార్యక్రమాలు చేపడతారని తెలుస్తోంది.
అంతా బాగానే ఉంది కానీ.. ఫండ్ రైజింగ్ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? ఇంతకుముందు సాయానికి వస్తామన్న స్టార్ హీరోలతో ఏవైనా భారీ కార్యక్రమాలు చేస్తారా లేదా? అన్నది చెప్పాల్సి ఉందింకా. అమెరికా సహా విదేశాల్లో పలు భారీ ఈవెంట్లు తలపెట్టే సన్నివేశం ఉందా లేదా? అన్నది అధ్యక్ష కార్యవర్గంలో ఎవరైనా ప్రకటించాల్సి ఉంటుంది.