Begin typing your search above and press return to search.

రిలీజ్ కోసం రాజశేఖర్ ఫ్లాట్ తాకట్టు

By:  Tupaki Desk   |   4 Nov 2017 5:51 AM GMT
రిలీజ్ కోసం రాజశేఖర్ ఫ్లాట్ తాకట్టు
X
ఓ సినిమాను తీయడం కంటే.. దాన్ని రిలీజ్ చేసుకోవడం చాలా కష్టం అనే సంగతి ఇండస్ట్రీ జనాలకు బాగానే తెలుసు. ఫైనాన్స్ తీసుకుని మూవీ పిక్చరైజేషన్ పూర్తి చేసినా.. రిలీజ్ కు ముందు రోజున ఫైనాన్షియర్ల నుంచి నో అబ్జెక్షన్ తెచ్చుకోవడానికి చాలానే కష్టాలు పడాల్సి ఉంటుంది. రీసెంట్ గా రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న పీఎస్వీ గరుడవేగ మూవీ విషయంలో రాజశేఖర్ కూడా ఈ కష్టాలను ఫేస్ చేశాడట.

ఈ చిత్రంపై చాలా పెద్ద మొత్తమే వెచ్చించి పిక్చరైజ్ చేయగా.. డిస్ట్రిబ్యూషన్ వరకూ ఎలాంటి సమస్యలు రాలేదు. కోస్తాలో సురేష్ మూవీస్.. సీడెడ్ లో సాయి కొర్రపాటి.. నైజాంలో మార్కాపురం శివకుమార్ రిలీజ్ చేయడంతో డిస్ట్రిబ్యూషన్ కి ప్రాబ్లెం లేదు. కానీ విడుదల చేసేందుకు 3 కోట్ల రూపాయల ఫైనాన్స్ ను క్లియర్ చేయాల్సి ఉందట. దీన్ని క్లియర్ చేసేందుకు థియేటర్ల నుంచి అడ్వాన్స్ లు తీసుకోవాలని భావించారట కానీ వర్కవుట్ కాలేదని తెలుస్తోంది.

ముందురోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎంత ప్రయత్నించినా క్లియరెన్స్ రాకపోవడంతో.. చివరకు మంచి పోష్ ఏరియాలోని తన 5వేల చదరపు అడుగుల ఫ్లాట్ ను తాకట్టు పెట్టి మరీ 3 కోట్ల ఫైనాన్స్ క్లియర్ చేసుకున్నాడట. కానీ ఇప్పుడు మూవీకి మంచి టాక్ రావడం.. ఇంకా శాటిలైట్ హక్కులు విక్రయించాల్సి ఉండడం.. మూవీకి మంచి కలెక్షన్స్ కంటిన్యూ అవుతుండడంతో.. త్వరలోనే తన ఫ్లాట్ ను మళ్లీ విడిపించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.