Begin typing your search above and press return to search.

బన్నీకి రాజశేఖర్ స్ఫూర్తి?

By:  Tupaki Desk   |   3 Jan 2018 3:30 AM GMT
బన్నీకి రాజశేఖర్ స్ఫూర్తి?
X
అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫస్ట్ ఇంపాక్ట్ నిన్ననే లాంచ్ అయింది. ఫస్ట్ ఇంపాక్ట్ సాలిడ్ గా ఉందని ఏకంగ్రీవంగా తీర్మానించారు. ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది ఫస్ట్ ఇంపాక్ట్. ఇందులో ఫెరోషియస్ సోల్జర్ పాత్రలో బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్ మెస్మరైజ్ చేసేసింది. దేశమంటే విపరీతమైన ప్రేమ.. అలాగే తప్పు చేసే వాళ్లంటే పట్టరాని కోపం.. తన మీద తనకు అదుపులేని సైనికుడి పాత్రలో బన్నీ కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మధ్యే యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఉన్న కుర్రాడి పాత్రతో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ గుర్తుకొచ్చింది ‘నా పేరు సూర్య’ ఫస్ట్ ఇంపాక్ట్ చూస్తున్నపుడు. ఐతే యాంగర్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ మినహాయిస్తే ఆ కథకు.. ఈ కథకు ఏమాత్రం పోలిక లేదు.

ఐతే ఒక రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే మాత్రం ‘నా పేరు సూర్య’ను పోలిన సినిమా ఒకటి కనిపిస్తుంది. అదే ‘ఆగ్రహం’. సీనియర్ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. అందులో రాజశేఖర్ కూడా దాదాపుగా ‘నా పేరు సూర్య’లో బన్నీ తరహా పాత్రే చేశాడు. అతనూ అందులో సైనికుడే. సెలవుల్లో ఇంటికి వచ్చిన అతను ఇక్కడ బాధ్యతారాహిత్యంతో ఉన్న జనాల్ని చూసి కోపం పట్టలేకపోతాడు. ఎక్కడికక్కడ తప్పు చేస్తూ కనిపించిన వాళ్లందరినీ కొట్టేస్తుంటాడు. దీని వల్లే అతను చాలా ఇబ్బందులు పడతాడు. హీరోయిన్ ఇంటికి వెళ్తే అక్కడ దేశం గురించి తప్పుగా మాట్లాడాడని ఆమె సోదురుడినే కొట్టేస్తాడు. బయట కూడా ఇలాగే స్పందించి ఇబ్బందులు కొని తెచ్చుకుంటాడు. పై అధికారుల హెచ్చరికలూ అందుకుంటాడు. విలన్లతో పోరాటం మొదలుపెడతాడు. ‘నా పేరు సూర్య’ చాలా వరకు ఆ సినిమాను గుర్తుకొస్తోంది. మరి వక్కంతం వంశీ ఆ కథ స్ఫూర్తితోనే ‘నా పేరు సూర్య’ను తీర్చిదిద్దుతున్నాడా లేదా అన్నది సినిమా విడుదలైనపుడు తేలుతుంది.