Begin typing your search above and press return to search.
రాజశేఖర్.. కొంచెం తగ్గండి సార్
By: Tupaki Desk | 27 Aug 2018 7:01 AM GMTసీనియర్ హీరో రాజశేఖర్ చాలా ఏళ్ల తర్వాత తన ఉనికి చాటుకున్న సినిమా ‘పీఎస్వీ గరుడవేగ’. గత ఏడాది తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటి. కానీ ఈ సినిమాను హిట్ అని మాత్రం చెప్పలేం. కమర్షియల్ గా చూస్తే మాత్రం ఈ చిత్రం ఫెయల్యూరే. ఇందుక్కారణం దీనికి అయిన ఓవర్ బడ్జెట్టే. గత దశాబ్ద కాలంలో రాజశేఖర్ మార్కెట్ బాగా దెబ్బ తినేసి ఆయన సినిమా మీద ఐదు కోట్ల పెట్టుబడి పెట్టినా కష్టమే అన్నట్లు తయారైంది పరిస్థితి. కానీ ‘గరుడవేగ’ మీద ఏకంగా రూ.25 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేశారు. దీంతో ‘గరుడవేగ’ ఉన్నంతలో బాగానే ఆడినా.. పెట్టుబడిలో సగం మాత్రమే వెనక్కి వచ్చింది. మరి ఈ చిత్ర నిర్మాత పరిస్థితి ఏంటన్నది తెలియదు. పెట్టుబడిలో కొంత వరకు రాజశేఖర్ కుటుంబం వాటా కూడా ఉందని అన్నారు. మరి వాళ్లు ఏమేరకు నష్టపోయారో ఏమో?
కాకపోతే ‘గరుడవేగ’తో రాజశేఖర్ తిరిగి కొంత మార్కెట్ సంపాదించుకున్నాడు. ప్రేక్షకుల నమ్మకాన్ని పొందాడు. ఇది ఆయన కొత్త సినిమా ‘కల్కి’కి కలిసొస్తుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నాడు. దీని మోషన్ పోస్టర్ తాజాగా విడుదలైంది. అందులో ‘గరుడవేగ’కు తగ్గని భారీతనం కనిపిస్తోంది. ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగే పీరియడ్ ఫిలిం అట. అప్పటి నేపథ్యంలో అథెంటిక్ ఫిలిం తీయాలంటే ఖర్చు ఎక్కువే అవుతుంది. కానీ ఈసారి కూడా ‘గరుడవేగ’కు పెట్టినట్లు ఖర్చు పెట్టేస్తే అంతే సంగతులు. ఎంత మంచి సినిమా తీసినా.. ఎన్ని ప్రశంసలు వచ్చినా ఏం లాభం? పెట్టుబడి వెనక్కి రాకపోతే మొత్తం వృథానే. కాబట్టి ‘గరుడవేగ’కు జరిగిన తప్పు ‘కల్కి’ విషయంలో జరగకుండా చూసుకోవాలి. బడ్జెట్ కొంచెం అదుపులో ఉంచుకోవాలి. బిజినెస్ విషయంలో అన్నీ లెక్కలు వేసుకుని సినిమా తీయాలి. రాజశేఖర్-ప్రశాంత్ వర్మ జోడీ ఈ విషయంలో జాగ్రత్త పడుతుందేమో చూడాలి.