Begin typing your search above and press return to search.
ప్లాన్ ప్రకారమే రాజశేఖర్ రచ్చ చేశారా?
By: Tupaki Desk | 2 Jan 2020 12:23 PM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రసాబాస గురించి తెలిసిందే. మా డైరీ ఆవిష్కరణ సంగతి అటుంచితే ఈ వేదికపై ఎంతో హుందా అయిన పెద్దలు ఉండగానే బోలెడంత రచ్చ జరిగింది. మా కీలక సభ్యుడు హీరో రాజశేఖర్ కి మా అధ్యక్షుడు నరేష్ తో ఉన్న గొడవలపై బోలెడంత చర్చ జరిగేలా ప్రవర్తించడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. పెద్దలైన చిరంజీవి- మోహన్ బాబు సైతం రాజశేఖర్ బహిరంగ వ్యాఖ్యల్ని తప్పు పట్టారు. సమస్య ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకుందామని మీడియా ముందు ఇలా బయటపడొద్దని వారించే ప్రయత్నం చేశారు. కానీ ఏదీ అనుకున్న ప్రకారం జరగలేదు.
దీంతో మెగా బాస్ చిరంజీవి బహిరంగంగానే అసహనం వ్యక్తపరిచారు. ఒకానొక దశలో పరిస్థితి అదుపు తప్పడంపై సీరియస్ అయ్యారు. ముఖ్యంగా హీరో రాజశేఖర్ వైఖరిని ఖండిస్తూ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ``రాజశేఖర్ వ్యవహారం ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇలాంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. బయటి ప్రపంచానికి మన బలహీనతను చెప్పుకోవడమే ఇది`` అంటూ చిరంజీవి మీడియా లైవ్ లోనే సీరియస్ అవ్వడం ప్రధానంగా చర్చకు వచ్చింది.
మా డైరీ లాంచ్ వేదికపై మాట్లాడుతున్న పరుచూరి చేతి నుంచి మైక్ లాక్కొన్న రాజశేఖర్ తీరు సరికాదని.. పెద్దల్ని ధిక్కరించడమేనని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు చిరు. సౌమ్యంగా మాట్లాడాలని ప్రయత్నిస్తే నేను కూడా అగ్రెస్సివ్ గా మాట్లాడే పరిస్థితి తెచ్చారు. ఇది చాలా అభ్యంతరకరం. రాజశేఖర్ వెల్ ప్లాన్డ్ గానే వచ్చారని అర్ధమైంది. క్రమశిక్షణా చర్యల సంఘం ఉంటే కఠినచర్యలు తీసుకోవాలి. అవసరమైతే తీసి బయటపడేయాలి!! అని చిరంజీవి వ్యాఖ్యానించారు. అయితే ఈ గొడవను ముందే రాజశేఖర్ ప్లాన్ చేశారా? అంటూ మా సభ్యుల్లో చర్చ వేడెక్కిస్తోంది.