Begin typing your search above and press return to search.
ముందు నేనూ డౌట్ పడ్డా...
By: Tupaki Desk | 24 Sep 2017 7:30 PM GMTరాజశేఖర్ కెరీర్ లోనే అతి భారీ బడ్జెట్ చిత్రం పి.ఎస్.వి. గరుడ వేగ 126.18ఎం. ఈ సినిమా కోసం రూ. 25 కోట్ల వరకు ఖర్చు పెట్టారనే విషయం టాలీవుడ్ లో చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఎందుకుంటే ఈ మధ్య రాజశేఖర్ లైమ్ లైట్ లో లేడు. గత కొన్నేళ్ల కాలంలో ఎవడైతే నాకేంటి మినహా అతడి ఖాతాలో హిట్లంటూ ఏమీ లేవు. ఇలాంటి టైంలో భారీ బడ్జెట్ తో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. గుంటూరు టాకీస్ ఫేం ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు డైరెక్టర్.
ఈ సినిమా చేయడం వెనుక కారణాలను ఇటీవల రాజశేఖర్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ‘‘హీరోగా వరస ఫ్లాపులు ఎదురవుతుండటంతో నెగిటివ్ రోల్స్ లేదా క్యారెక్టర్ రోల్స్ లో నటించమంటూ చాలామంది సలహా ఇచ్చారు. వాటి గురించి నేనూ సీరియస్ గానే ఆలోచించా. ఆ తర్వాత చాలామంది కలిసి స్టోరీలు వినిపించారు. అవేవీ ఎక్సైటింగ్ గా అనిపించలేదు. అలాంటి టైంలో ప్రవీణ్ సత్తారు ఈ స్టోరీ వినిపించాడు. నా సినిమా ‘మగాడు’ అంతే తనకు ఇష్టమని.. ఆ జోనర్ లో సినిమా చేద్దామని చెప్పుకొచ్చాడు. అసలు ఈ సబ్జెక్టు తను హ్యాండిల్ చేయగలడా అని ముందు నేనూ డౌట్ పడ్డా.. కానీ తన పని అద్భుతంగా పూర్తి చేశాడు’’ అంటూ ఈ చిత్రం నేపథ్యాన్ని వివరించాడు రాజశేఖర్.
‘‘ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ రూ. 5 కోట్లు మాత్రమే. తర్వాత ఈ స్టోరీకి మరింత బడ్జెట్ అవసరమన్న విషయం మాకు అర్ధమైంది. మంచి ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్న టైంలో మా నాన్న స్నేహితుడు కోటేశ్వరరాజు ఈ సినిమా నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ సినిమాను హాలీవుడ్ స్టాండర్డ్ లో నిర్మించాం. అందుకే అంత ఖర్చయింది’’ అని బడ్జెట్ ఎందుకు పెంచాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు రాజశేఖర్. అంతా బాగానే ఉంది కానీ.. ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాలకు బాలీవుడ్ లోనే కావాల్సినంత కలెక్షన్లు రావడం లేదు... మరి ఒక్క తెలుగులో ఈ రేంజి కలెక్షన్లు సాధ్యమయ్యే పనేనా... ఏమో వేచి చూడాలి.