Begin typing your search above and press return to search.

రాజశేఖర్‌.. కూతురికే విలన్‌

By:  Tupaki Desk   |   14 Dec 2015 1:30 PM GMT
రాజశేఖర్‌.. కూతురికే విలన్‌
X
హీరో నుంచి కేరక్టర్ ఆర్టిస్ట్ గా, తర్వాత లీడ్ విలన్ గా టర్నింగ్ ఇచ్చుకుని జగపతి బాబు సూపర్ ఫాంలోకి వచ్చేశాడు. ఇప్పుడీ రూట్ లో మరికొంత మంది సీనియర్ హీరోలు ఫాలో అవనున్నారనే వార్తలు కొంతకాలంగా వస్తున్నాయి. యాంగ్రీ యంగ్ మ్యాన్ "మగాడు" హీరో రాజశేఖర్ కూడా విలన్ గా మారనున్నాడు.

రవితేజ హీరోగా రూపొందనున్న ఎవడో ఒకడు చిత్రం కోసం నిర్మాత దిల్ రాజు రాజశేఖర్ ను కలిశాడు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీలో విలన్ కేరక్టర్ ఆఫర్ చేసినా.. దానికి నో చెప్పేశాడు రాజశేఖర్. కానీ.. ఈ సీనియర్ హీరో విలన్ గా మారడం మాత్రం ఖామయైంది. అది కూడా తన కూతురు సినిమాలోనే కావడం విశేషం. రాజశేఖర్ కూతురు శివాని "వందకు వంద" మూవీతో హీరోయిన్ గా అరంగేట్రం చేయనుంది. ఇదే సినిమాతో రాజశేఖర్ కూడా విలన్ గా మారనుండడం విశేషం. ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ కి లేడీస్ లో ఫుల్లు ఫాలోయింగ్ ఉంది. కొన్నాళ్లపాటు తనదైన చిత్రాలతో అలరించాక.. అల్లరి ప్రియుడు తర్వాత కుర్రాళ్లు, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా సూపర్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు రాజశేఖర్.

అలాంటి హీరో ఇప్పుడు విలన్ పాత్రల్లోకి మారడమంటే.. ఖచ్చితంగా సెన్సేషన్ అనే చెప్పాలి. అయితే తన కూతురు హీరోయిన్ గా నటించే సినిమాలో విలన్ రోల్ కి యాక్సెప్ట్ చేసినా.. రవితేజకి విలన్ గా వచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేయడం విశేషం.